‘మగధీర’ స్సూర్తితో తప్పుదోవ పడుతోన్న ఇండస్ట్రీ

By Sindhu

తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులు చూస్తుంటే 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు", రామ్ చరణ్ ద్వితీయ చిత్రం 'మగధీర" కు 40 కోట్లు కర్చు పెట్టారంటే అది పెద్ద సాహసమే. చిరంజీవి కొడుకు కావడంతో హీరోగా ఎంటర్ కాకముందే స్టార్ ఇమేజ్ తన సొంతం చేసుకున్నాడు దీనికి రాజమౌళి మీద ఉన్న నమ్మకం మీద అంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఆ నమ్మకం వమ్మ కాలేదు కాబట్టి సరపోయింది. మగధీర కు పరిస్థితులు కూడా అనుకూలించి బ్లాక్ బస్టర్ గా రికార్డులు తిరగరాసింది. దీన్ని ఇనన్ స్పిరేషన్ గా తీసుకొని మిగిలిన నిర్మాతలు ఎంతైన ఖర్చు పెట్టడానికి సిద్దమౌతున్నారు. మహేష్ బాబు, దర్శకుడు సురేందర్రెడ్డి కాంబినేషన్ లో ఆర్ ఆర్ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. దీన్ని భారీగా తెరకెక్కించనున్నారు. ఇదికూడా 40 కోట్లు దాటుతుందని ముందే అంచనా వేశారు.

అలాగే ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించే 'శక్తి" కూడా 40 కోట్లు దాటనుందట! 'పోకిరి సినిమా బంపర్ హిట్ అయితే వసూలు చేసిన మొత్తం 45కోట్లు, అలాగే ఎన్టీఆర్ హిట్ చిత్రం 'యమదొంగ"40 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆలెక్కన సినిమా బాగుందన్న టాక్ వస్తే పెట్టుబడిని వెనక్కి తీసుకురాగలగుతాయి. 'మగధీర" ఆదర్శంగా తీసుకొని తప్పుడు అంచనాలు వేయడం సమంజసం కాదన్న విషయం గ్రహించాలి. ఇటీవలే విడుదలైన 'సలీం" 23 కోట్లతో రూపొందింది. ప్లాప్ టాక్ వచ్చింది. ఇది మొత్తం మీద పది కోట్లు కూడా వసూలు చేయలేని పరిస్థితి నెలకొన్నది. పెద్ద హీరోల చిత్రాలకు ఇదే టాక్ వస్తే నిర్మాత, బయ్యర్లు, డిస్టిబ్యూటర్ల కొంప మునగడం ఖాయం. ఏదేమైనా 'మగధీర" స్పూర్తితో ఇండస్ట్రీ తప్పుదొవ పడుతోందనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X