Tollywood: రాబోయే నాలుగు నెలల్లో సినిమాల పండగ.. ఏ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక పండగ వాతావరణం నెలకొంది. రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ RRR సినిమా తో మాత్రం మళ్లీ ఒక్కసారిగా ఇండస్ట్రీ పుంజుకుంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగాయి. ఇక రాబోయే సినిమాలకు కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక రాబోయే నాలుగు నెలల్లో ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

గని.. రెడీ!
ఏప్రిల్ 1వ తేదీ నుంచి చూసుకుంటే మిషన్ ఇంపాజిబుల్ సినిమా మెగాస్టార్ సపోర్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కంటెంట్ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దానితోపాటు ఇదే నెల 8వ తేదీన గని సినిమా విడుదల కాబోతోంది వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించినా ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్
అయితే ఏప్రిల్ లో ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా అందరి ఫొకస్ మాత్రం మేజర్ గా రెండు పెద్ద సినిమాలపై పైన పడుతోంది. స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఏప్రిల్ 13వ తేదీన విడుదల అవుతుండగా కన్నడ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 మరుసటి రోజు అంటే 14 వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు మధ్య జరిగే బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది.

ఓకే రోజు మూడు చిన్న సినిమాలు
ఇక ఏప్రిల్ 22 వ తేదీన మరో మూడు చిన్న తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున్ కల్యాణం, నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు రాబోతున్నాయి. ఇక తెలుగు లో టాప్ మోస్ట్ సీనియర్ యాంకర్ సుమ మెయిన్ లీడ్ లో నటించిన జయమ్మ పంచాయతీ కూడా అదే రోజు విడుదల కానుంది.

మెగా మల్టీస్టారర్
మెగా హీరోల కలయికలో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

సూపర్ స్టార్ SVP
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల కాబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గీతగోవిందం దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చిన రెండు వారాల అనంతరం కామెడీ మల్టీస్టారర్ మూవీ F 3 మూవీ విడుదల కానుంది.

డిఫరెంట్ మూవీస్
వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన F3 సినిమా మే 27వ తేదీన విడుదల అవుతుండగా అదేరోజు అడివి శేష్ మేజర్ సినిమా కూడా రాబోతోంది. ఇక జూన్ 3వ తేదీన కమలహాసన్ విక్రమ్ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది ఈ సినిమాపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
Recommended Video


గోపిచంద్ vs వైష్ణవ్
జూన్ 10 తేదీన నేచురల్ స్టార్ నాని నటించిన అంటే.. సుందరానికి సినిమా విడుదల కానుండగా జూన్ 17 వ తేదీన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా విడుదల కానుంది. ఇక జూలై 1వ తేదీన ఒకేసారి రెండు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. గోపీచంద్ పక్కా కమర్షియల్ అలాగే వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా రంగ రంగ వైభవంగా కూడా అదే రోజు విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











