ఫ్రెంచ్ కిస్ లతో హీరోకి కిక్కెస్తోన్న ప్రియమణి..!
టాలీవుడ్ లో హాలీవుడ్ మసాలా ఊపందుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్లు ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. అలాగే, ఇప్పటి వరకు సాదాసీదా ముద్దు సీన్లలో కొంతమంది హీరోహీరోయిన్లు దర్శనమిచ్చారు. అయితే, గత కొంత కాలంగా మంచి హిట్ కోసం పరితపించి పోతున్న యువహీరో సుమంత్ తాజాగా కుమార్ బ్రదర్స్ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మలయాళ భామ ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ట్రెండీ లవ్ స్టోరీతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి హాట్ గా కనిపించనుంది. పైపెచ్చు సుమంత్ కు ఫ్రెంచ్ కిస్ ను కూడా రుచిచూపించిందట. అయితే, ఈ కిస్ తో సుమంత్ కు సినిమా కిక్కెస్తుందో లేదో తెరపై చూడాల్సిందే.
ఇదిలావుండగా, ఈ చిత్రంలో ప్రియమణితో పాటు..విమల రామన్ కూడా నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచే ఈ చిత్రానికి కోటి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











