సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఈ యేడాది 270 తెలుగు సినిమాలకు సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. అదే బాలీవుడ్ లో అయితే 256 సినిమాలుకు మాత్రమే సర్టిఫికేట్స్ ఇచ్చారు. అంటే మన టాలీవుడ్ ఈ సంవత్సరం భారత్ లో ఎక్కువ సినిమాలు నిర్మించిన పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకుంది. సెకెండ్ ప్లేస్ లో బాలీవుడ్ ఉంది. గత మూడేళ్ళుగా ఈ రికార్డుని తెలుగు పరిశ్రమ నిలబెట్టుకుంటూనే వస్తోంది. ఇక ఈ విషయాన్ని దృవీకరిస్తూ CBFC రీజనల్ ఆఫీసర్ టి.వి.కె.రెడ్డి తెలుగు పరిశ్రమ గతం కన్నా వేగవంతంగా ముందుకెళ్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాసి పెర్గినా వాసి ఎప్పుడు పెర్గుతుందనేది సినీ ప్రేమికుల ప్రశ్న. క్వాలిటీ సినీ నిర్మాణం పై దృష్టి ఎప్పుడు పెడతారన్నది వారి ఆవేదన.