అమ్మో అన్ని పైరసీ కేసులా?
హైదరాబాద్: తెలుగు పరిశ్రమకు పైరసీ అనేది రోజు రోజుకీ బిగుస్తున్న ఉరిలా తయారవుతోంది. క్రితం సంవత్సరం(2008)లో నమోదయిన 627 పైరసీ కేసులును బట్టి చూస్తేనే అది అర్ధమవుతోందంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇన్ని కేసులు నమోదు కావటం సిని వర్గీయులను భయభ్రాంతులను చేస్తోంది. పట్టుకున్న కేసులే ఇన్ని ఉంటే ఇంకా తెలియని బయిటపడనివి వేలల్లో ఉండవచ్చునని, దాని వల్లే కోట్లలో నష్టం తెలియకుండా వాటిల్లుతోందని అంటున్నారు సీనియర్లు. ఇక పట్టుకున్న కేసులన్ని నిరూపింపబడి, శిక్షలు పడితే కొంత క్రైమ్ రేట్ తగ్గుతుందనుకుంటే అది జరగటం లేదంటున్నారు.
ఇక ఇదే విషయమై కో ఆర్డినేటర్ యాంటి పైరసీ సెల్ ఆఫ్ టాలివుడ్ మిస్టర్ కేసవ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు చాలా సార్లు ఆధారాలు పట్టుకురావటంలో విఫలమవటం వల్ల చాలా కేసులు నీరుకారిపోతున్నాయంటున్నారు. దాదాపు పదిమంది సుల్తాన్ బజార్, ఎర్రగడ్డ, అమీర్ పేట, బ్యాంక్ స్ట్రీట్, బహదూర్ పుర ఏరియాలకు సంభంధించిన నిందుతులు ఉన్నారని వారిది ఇదే వ్యాపారమని, వారిపై కేసులు పెట్టినా నిరూపించలేక, ఇన్విస్టిగేషన్ జరగక వదిలివేస్తున్నారంటున్నారు.
ఇక స్పెషల్ కోర్టులు కూడా నిందుతులను హైదరాబాద్ తెప్పించటంలో విఫలమవుతున్నాయంటుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కరానికి ఫిల్మ్ పర్శనాలిటీలు కొందరు కలసి ఛీఫ్ జస్టిస్ ని కలిసి పైరసీ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు పెట్టి,ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా ఈ కేసులు కోసం పబ్లిక్ ప్యాసిక్యూటర్ ని ఏర్పాటు చేయాలని కోరాలని యోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











