గోపీచంద్ తో సూపర్ రొమాంటిక్ ఫీల్... ఓహ్
నిన్నగాక మొన్నొచ్చిన పొడుగు పిల్ల దీక్షాసేథ్ అనుష్క, ఇలియానా వంటివారిని దాటుకుంటూ యమస్పీడుతో ఆఫర్లు దక్కించుకుంటూ వెళ్లిపోతోంది. అంతేకాదండోయ్...తన సెక్సీ ఫిగర్ ను కావలసినంత గ్లామర్ గా చూపిస్తూ టాలీవుడ్ కత్రినా అనే ఇమేజ్ ను తెచ్చేసుకుంది. అయితే టాలీవుడ్ లో ఆమెకు మరో దివ్వభారతి అని అని కూడా టాలీవుడ్ లో టాక్. తాజాగా ఆమె గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో గోపీతో నటించిన అనుభవాన్ని చెపుతూ, షూటింగ్ లో అన్ని విషయాలు చాలా చక్కగా నేర్పాడని గోపీచంద్ కు కితాబిస్తోంది. సోలో హీరోయిన్ గా ఆయన పక్కన నటించడం చాలా థ్రిల్ గా ఉందనీ, ఇటువంటి అవకాశం తక్కువ కావలంలోనే రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.
గోపీచంద్ తో నటిస్తుంటే రొమాంటిక్ ఫీలింగ్ కల్గిందని డైరెక్టుగా చెప్పింది. వెంటనే..నాలుక్కరుచుకుని..సన్నివేశంలో రొమాంటిక్ గా ఫీలవ్వాలి గనుక తను చెప్పినట్లే ఫీలై నటించాననీ అంది. అనుష్కలో కూడా గోపీ అలాంటి ఫీలింగ్ కల్గించి బాగా నటింపజేశాడన్న సంగతి దీక్షకు తెలుసో లేదో మరి.


Click it and Unblock the Notifications











