Anantha Sriram: మూడు కోణాల్లో దాడి.. ప్రభాస్ 'కల్కి'పై అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!
Anantha Sriram: ప్రముఖ తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన పాటలల్లో తెలుగుదనం ఉట్టిపడేలా.. సాహిత్య విలువలను మేళవిస్తూ పాటలను రాస్తారు. ఆయన పాటలల్లో తెలుగు భాష ఔన్నత్యం, గొప్పదనం కనిపిస్తుంది. ఇలాంటి రచయితలు ఉండడం వల్లే తెలుగు ఇంకా సజీవంగా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదెలా ఉంటే..తాజాగా అనంత శ్రీరామ్ తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అనంత శ్రీరామ్ తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరించబడుతుందన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని, వ్యాపారం కోసం హిందుధర్మ వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఓ సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నననీ, చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్ననని అనంత శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు.

సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని ఆరోపించారు అనంత శ్రీరామ్. ' అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, రెండవది .. తెర మీద కనిపించే పాత్రల్లో.. వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, మూడవది తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ' అంటూ సంచలన వ్యాక్యాలు చేస్తారు.
'కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం.. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం .. ఇది భారత సాహిత్యానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే మహాభారతాన్ని, రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా ఎన్నో వక్రీకరణలు జరిగాయి' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అనంత శ్రీరామ్..

సినిమాల్లో కర్ణుడి పాత్రకు అనవసరంగా గొప్పదనాన్ని ఆపాదిస్తున్నారనీ, అది చూసి ఒక సినిమా వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని ఖండిస్తూ.. నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే .. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సంచలన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర దారి తీయబోతాయనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











