మెగాస్టార్ సినిమాలకు పాటలు రాశాడు... ఇప్పుడు దొంగగా మారి అరెస్టయ్యాడు!
ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ గేయ రచయితగా పేరు తెచ్చుకుని మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ల సినిమాలకు అద్భుతమైన పాటలు రాసిన వ్యక్తి ఇపుడు దొంగగా మారి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
అతడు మరెవరో కాదు... ఒకప్పుడు ఎన్నో సినిమాలకు పాటలు రాసిన సినీగేయ రచయిత కులశేఖర్. ప్రస్తుతం అతడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కులశేఖర్ ఓ దేవాలంలో దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

కులశేఖర్ చోరీ చేసినట్లు తేల్చారు
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 ఇందిరానగర్‌లోగల ఓ దేవాలయంలో పూజారి బ్యాగ్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను నిందితుడు లాక్కొని పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు కులశేఖర్ అని కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.

అవకాశాలు తగ్గడం వల్లేనా?
విశాఖపట్నానికి చెందిన కులశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ ద్వారా సినీ గేయ రచయితగా పరిచయం అయ్యాడు. చిరు నటించిన మృగరాజు, ఇంద్రతో పాటు సంతోషం, ఘర్షణ, ప్రేమలేఖ, చిత్రం ఇలా దాదాపు వంద సినిమాలకు పాటలు రాశాడు. అయితే అవకాశాలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కులశేఖర్ దొంగగా మారాడని చెబుతుంటారు. అయితే కొందరేమో అతడి మానసిక స్థితి సరిగా లేక పోవడం వల్లనే ఇలా చేస్తున్నాడని అంటున్నారు.

గతంలో ఆరు నెలలు జైల్లో
2013లో కాకినాడలోని హనుమాన్ దేవాలయంలో వెండి కిరీటం దొంగలించిన కులశేఖర్ 2016లో రాజమండ్రి జైల్లో ఆరు నెలల శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి బోరబండలో నివాసం ఉంటున్నాడు.

అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్
కులశేఖర్ తన సొంత గ్రామంలో ఏర్పడ్డ వివాదం తర్వాత మెంటల్‍గా డిస్ట్రబ్ అయ్యాడని, అప్పటి నుంచే దేవాలయాల్లో చోరీలు చేస్తున్నాడనే మరో వాదన కూడా ఉంది. తాజాగా బంజారాహిల్స్ పోలీసులు కూడా అతడి మానసిక స్థితి సరిగా లేదని నిర్దారించారు. ప్రస్తుతం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


Click it and Unblock the Notifications











