టాలీవుడ్‌పై కోలుకోలేని దెబ్బ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత.. ఆ వ్యాధితో పోరాడుతూ మృతి!

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న కాక మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన బాధ నుంచి కోలుకోక ముందే తెలుగు సినీ కళామ్మ తల్లి ముద్దు బిడ్డ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu
హాస్పిటల్ లో చేరిక

హాస్పిటల్ లో చేరిక

సిరివెన్నెల సీతారామశాస్త్రి కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా ఆయనకు వైద్య నిపుణులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఊహించని రీతిలో ఆయన ఈ లోకం నుంచి నిష్రమించారు. దీంతో సంగీత, సాహిత్య ప్రపంచం మూగపోయింది. ఆయన వయసు ప్రస్తుతం 66 యేళ్లు. నిజానికి ఆయన హాస్పిటల్ పాలయినప్పటి నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. దానికి ఆయన కుటుంబం, ఆయన చేరిన హాస్పిటల్ యాజమాన్యం ఖండిస్తూ వచ్చింది.

కెరీర్ అలా మొదలు

కెరీర్ అలా మొదలు

అయితే తాజా సమాచారం మేరకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ రోజు మధ్యాహ్నం 4.07 గంటలకు కన్నుమూశారు. అతను ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మరణించాడు. 1955లో తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ లిరిక్ రైటర్ గా బాలకృష్ణ హీరోగా కళా తపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనని జన్మభూమి' సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు.

ఆ సినిమాతో బ్రేక్

ఆ సినిమాతో బ్రేక్

ఆ సినిమా తర్వాత జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాశారు సీతారామశాస్త్రి, అయితే అవేవీ ఆయనకు అంత మంచి పేరు తీసుకురాలేదు. కానీ ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసిన సీతారామశాస్త్రి రాశారు. ఆ సినిమాతో చేంబోలు సీతారామశాస్త్రి కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారారంటే ఆ పాటలు ఎంతగా జనాన్ని ఆకట్టుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.,

వేల సంఖ్యలో పాటలు

వేల సంఖ్యలో పాటలు

ఆ తర్వాత ఆయన సినీ గేయ రచయితగా.. ఆయన 'స్వయంకృషి', 'స్వర్ణ కమలం', సంసారం ఒక చదరంగం', 'శృతి లయలు, ఇంద్రుడు చంద్రుడు, నిన్నేపెళ్లాడతా, గాయం, అంతం, అల్లుడు గారు, క్షణ క్షణం, మనీ, సింధూరం, మురారి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి రాబోయే ఆర్ఆర్ఆర్ లోని దోస్తీ సాంగ్ వరకు ఎన్నో సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు రాసి అజరామరం అయ్యారు.

పద్మశ్రీ బిరుదు

పద్మశ్రీ బిరుదు

గేయ రచయితగానే కాక ఆయన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'గాయం'లో నటుడిగా మారారు. ఈ సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని పాటను రాయగా ఆ సాంగ్‌‌ లోనే ఆయన కనిపిస్తారు. తన 37 యేళ్ల సినీ ప్రస్థానంలో 3 వేలకు పైగా పాటలు రాసిన ఆయన 11 నంది అవార్డులు, 4 ఫిలిం ఫిర్ అవార్డులు అందుకున్నారు ఆయన. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. అలా తెలుగులో ఓ సినీ గేయ రచయతగా ఆ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి సీతారామశాస్త్రి.

కుమారులు కూడా

కుమారులు కూడా

సీతారామశాస్త్రి విడుదలకు సిద్ధంగా ఉన్న రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దోస్తీ సాంగ్ రాశారు. అలాగే వెంకటేష్ నారప్పలో రెండు పాటలు, క్రిష్- వైష్ణవ్ తేజ్ కొండపొలం లో ఆయన పాటలు రాశారు. ఆయన కుమారులు రాజా, యోగి కూడా తెలుగు సినిమా పరిశ్రమలోనే సేవలు అందిస్తున్నారు. రాజా ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X