For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హుధూద్: 10 కోట్లు టార్గెట్‌గా టాలీవుడ్ మెగా ఈవెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూత్ తుఫాన్ బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా కలిసి మెగా ఈ వెంటుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 9న నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 10 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 13 గంటల పాటు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇందుకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను వేదికగా ఎంచుకున్నారు. ఈ మెగా ఈ వెంటులో టాలీవుడ్ స్టార్స్ డాన్స్ ఈ వెంట్స్, కామెడీ షో, ఇతర కల్చరర్ ఫ్రొగ్రామ్స్ ఉండనున్నాయి.

    Tollywood Mega Event for Hudhud cyclone Fund

    పరిశ్రమ మొత్తం కలిసి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం కావడంతో టాలీవుడ్‌కి చెందిన స్టార్స్ అంతా హాజరవుతారని తెలుస్తోంది. ఈ మెగా ఈవెంటుకు సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌‍తో ఇతర పరిశ్రమల స్టార్స్ కూడా హాజరు కాబోతున్నారు. టికెట్స్, డొనేషన్స్ రూపంలో నిధులు సమకూర్చాలని ప్లాన్ చేస్తున్నారు. ‘వి లవ్ వైజాగ్' పేరుతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మెగా ఈ వెంటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    English summary
    We knew the fact that the Hudhud cyclone has destroyed Vizag and the Film industry celebrities are giving hand to help the victims of Vizag. The entire Tollywood industry is joining hands for a mega telethon titled ‘We Love Vizag’ to raise funds for the victims of Vizag on November 9th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X