తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ ‘మేము సైతం’

By Bojja Kumar

హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు నిధుల సేకరణలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ఈ నెల 30 భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మేము సైతం' పేరుతో సాగే ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. ఈ కార్యక్రమం వివరాలు తెలియజేసేందుకు తెలుగు సినీ ప్రముఖులు మురళీ మోహన్, అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ....తుఫాను బాధితులకు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. గతంలోనూ విపత్తుల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేసారు.

హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు నిధుల సేకరణలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ఈ నెల 30 భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘మేము సైతం’ పేరుతో సాగే ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. ఈ కార్యక్రమం వివరాలు తెలియజేసేందుకు తెలుగు సినీ ప్రముఖులు మురళీ మోహన్, అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ....తుఫాను బాధితులకు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. గతంలోనూ విపత్తుల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేసారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ....అన్నపూర్ణ స్టూడియోలో ఈ నెల 30 కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం సినీ పరిశ్రమకు చెందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. సంగీత దర్శకుడు, డాన్సర్లతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే మొత్తాన్ని తుఫాను బాధితుల సహాయార్థం అందించనున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మేముసైతం డాట్ కామ్ లో ఉంటాయని తెలిపారు. ఈ స్టార్ నైట్ ఈవెంట్ ని హిట్ చేయడం కోసం చిత్ర పరిశ్రమ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా లైవ్ లో జరిగే ఈ లైవ్ టెలీథాన్ లో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఆ రోజు స్టేజ్ పై పెర్ఫార్మన్స్ చేసే వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కూడా ఉండటం విశేషం. వీరిద్దరూ చేసే ప్రోగ్రాంకి సంబంధించిన డిజైన్ మరియు ప్రోగ్రాం స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు ఒకేసారి లైవ్ లో స్టేజ్ పైన ఒక పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది జరగలేదు. దాంతో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ పోగ్రాం అద్బుతంగా జరుగుతుందని భావిస్తున్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ....అన్నపూర్ణ స్టూడియోలో ఈ నెల 30 కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం సినీ పరిశ్రమకు చెందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. సంగీత దర్శకుడు, డాన్సర్లతో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే మొత్తాన్ని తుఫాను బాధితుల సహాయార్థం అందించనున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మేముసైతం డాట్ కామ్ లో ఉంటాయని తెలిపారు.

ఈ స్టార్ నైట్ ఈవెంట్ ని హిట్ చేయడం కోసం చిత్ర పరిశ్రమ అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా లైవ్ లో జరిగే ఈ లైవ్ టెలీథాన్ లో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఆ రోజు స్టేజ్ పై పెర్ఫార్మన్స్ చేసే వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కూడా ఉండటం విశేషం. వీరిద్దరూ చేసే ప్రోగ్రాంకి సంబంధించిన డిజైన్ మరియు ప్రోగ్రాం స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబులు ఒకేసారి లైవ్ లో స్టేజ్ పైన ఒక పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది జరగలేదు. దాంతో ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈ పోగ్రాం అద్బుతంగా జరుగుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X