మిస్ ఆంధ్రా పైనల్స్, సినీ తారలతో.. (ఫోటోలు)
హైదరాబాద్: గత ఏడాదిగా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టాణాలలో ఫ్యాషన్‌షోలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎంపికైన వారికి సోమాజిగూడలోని పార్క్ హోటల్ వేదికగా టాలీవుడ్ మిస్ 2012 పోటీలు జరిగాయి.
అటు సంప్రాదాయ దుస్తులు, ఇటు పార్టీ వేర్ వస్త్రాలతో తెలుగు అమ్మాయిల క్యాట్ వాక్ అదిరిపోయింది. వీటికి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు నుంచి మోడల్స్ వచ్చారు. అచ్చ తెలుగు అమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కొరతని తీర్చేందుకు సాయి ఎంటర్ ట్రైన్మెంట్ ఈవెంట్ ఆధ్వర్యంలో టాలీవుడ్ మిస్ హైదరాబాద్ పోటీలు నిర్వహించారు. టాలీవుడ్ మిస్ ఏపీ పోటీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు జరిగాయి. ర్యాంప్ పై హల్ చల్ చేశారు. గీతామాధురి, శ్రీకృష్ణ సంగీత విభావరి ఈ షోకు హైలెట్ గా నిలిచాయి. డ్యాన్స్ లు కుర్రకారును హుషారెత్తించాయి.

మిస్ ఏపీగా సిమ్రాన్ గెలిచింది.

మొదటి రన్నరప్‌గా సాయి శీరిష, రెండో రన్నరప్‌గా షాహిన్‌లు ఎంపికయ్యారు.

న్యాయనిర్ణేతలుగా నటి రాశి, నటుడు నిఖిల్, దర్శకులు సాగర్, అవనేంద్రకుమార్ వ్యవహరించారు.

కార్యక్రమానికి కమెడియన్ ఆలీ, నటి శ్రీరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కోలాహలంగా సాగిన ఈ ఫ్యాషన్ షోలో సినీ గాయకులు గీతామాధురి, పరిణిక, శ్రీకృష్ణ ఆలపించిన గీతాలకు వీక్షకులు కదం కలిపారు.

అర్చన అలియాస్ వేద నృత్యం సెంటరాఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











