టాలీవుడ్ 2019 : బూతు చిత్రాల దాడి.. హీట్ పెంచే సీన్లు, బోల్డ్ డైలాగ్‌లతో రచ్చ

ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకునేవారిలో కొంతమంది బూతు కంటెంట్‌నే నమ్ముకుని వస్తారు. ఓ ఐదు ఘాట డైలాగ్‌లు, మరో ఐదు హీట్ పెంచే శృంగార సన్నివేశాలను రాసుకుని వారికి ఇష్టమొచ్చిన కథను వండివార్చేస్తారు. అలా ఈ ఏడాది బూతు చిత్రాల దాడి కాస్త ఎక్కువే అయింది. అయితే సినిమాలో కథ ఉంటేనే ఆడుతుందని, బూతు ఉంటే కాదని మరోసారి నిరూపించింది. వాటిని నమ్ముకుని ఈ ఏడాది తీసిన ఏ చిత్రమూ విజయవంతం కాలేదు.

చీకటి గదిలో చితక్కొట్టుడు అంటూ..

చీకటి గదిలో చితక్కొట్టుడు అంటూ..

చీకటి గదిలో చితక్కొట్టుడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌నే పెట్టి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అడల్ట్ హారర్ కామెడీ చిత్రంలో కావల్సినన్నీ బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి కానీ కథ, కథనాలే లేవు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఏడు చేపల కథ..

ఏడు చేపల కథ..

టైటిల్ చూసి చిన్నప్పుడు చెప్పే ఏడు చేపల కథ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. A సర్టిఫికేట్ ఎక్కువ.. పోర్న్ మూవీకి తక్కువ అనేలా ఉందని టీజర్, ట్రైలర్, పోస్టర్స్ చూసి నోటిపై వేలేసుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే సెన్సార్ సభ్యులే తలపై చెంగు కప్పుకునేంతగా ఇందులో సీన్లు ఉండటంతో ఫైనల్ ఔట్ పుట్ వచ్చే సరికి అన్నీ కత్తెర్లే కనిపించాయి. అశ్లీలత, అసభ్యకరమైన సంభాషనలు ఉన్నా.. పరిధిమేరకు మాత్రమే ఉన్నాయి. హద్దులు దాటినట్టుగా ఎక్కడా కనిపించవు. అలా ఈ చిత్రం కూడా తుస్సుమంది. ఓ నిర్దిష్టమైన కథ, దానికి తగ్గ కథనం ఉన్నప్పుడే సినిమాలు ఆడతాయి.

ఆర్‌డీఎక్స్ లవ్..

ఆర్‌డీఎక్స్ లవ్..

ఆర్‌ఎక్స్ లవ్ అనే చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఇందు పాత్రను పోషించిన పాయల్ రాజ్‌పుత్‌కు అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది. ఆ ఫేమ్‌ను క్యాష్ చేసుకుందామనే క్రమంలో వచ్చిందే ఆర్‌డీఎక్స్ లవ్. పాయల్ అందాల ఆరబోతలు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లే తప్పా ఏమీ లేని ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.

టూ అవర్స్ లవ్..

టూ అవర్స్ లవ్..

కొత్త కాన్సెప్ట్‌లు అంటూ చెత్త అంతా తెరపైకి తీసుకొస్తారు కొంత పైత్యమున్న మేధావులు. ఆ క్రమంలో వచ్చిందే ఈ టూ అవర్స్ లవ్. టీజర్, ట్రైలర్‌లతో హైప్ క్రియేట్ చేసి థియేటర్ల వరకు రప్పించేందుకు కొత్త పోకడలకు తెరలేపుతున్నారు. సినిమాలో ఉన్న రొమాంటిక్ సీన్లను కట్ చేసి చూపిస్తారు. ఘాటు ముద్దు సీన్లను నమ్ముకున్న ఈ చిత్రం వచ్చినట్టు కూడా ఎవరికీ తెలీదు.

డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో..

డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో..

మన్మథుడు లాంటి క్లాసిక్ చిత్రాన్ని సీక్వెల్ పేరిట నాశనం చేశారు. సినిమా నిండా డబుల్ మీనింగ్ డైలాగ్‌లను పెట్టి ఎబ్బెట్టు కలిగేలా చేశారు. నాడు త్రివిక్రమ్ రాసిన మాటలే మన్మథుడు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. అయితే ఈ మన్మథుడు 2 చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు శృతిమించాయనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.

బోల్డ్ సీన్స్‌తో నేను లేను

బోల్డ్ సీన్స్‌తో నేను లేను

బోల్డ్ కంటెంట్‌ను నమ్ముకుని వచ్చిన మరో చిత్రం నేను లేను. మితిమీరిన శృంగార సన్నివేశాలు, బీప్‌ వేసుకోవడానికే పరిమతమయ్యే డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో విసుగు పుట్టించాడు. ఇలాంటి ఓ చిత్రముందని కూడా కొంతమందికి తెలియకపోవడం విశేషం.

అందాల ఆరబోతతో..

అందాల ఆరబోతతో..

లక్ష్మీ రాయ్ ఒకప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్. తరువాత ఐటెం సాంగ్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తూ వచ్చింది. వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ అనే ఓ హారర్ చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అందులో అందాల ఆరబోత తప్ప కథ ఏమీ లేకపోయే సరికి మళ్లీ వెనుదిరిగిపోయింది. ఇలా బూతు కంటెంట్‌లపై దృష్టి పెట్టకుండా కొత్త పాయింట్‌ను, అందరూ మెచ్చేలా, చూసేలా తెరకెక్కిస్తే విజయాలు వరిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X