twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పటి వరకు మెగాస్టార్ కనిపించడు, ప్రభాస్ రాడు.. పుష్ప, RRR కూడా లేనట్లే..

    |

    కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలపై ప్రభావం పడింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలకు గతంలో ఎప్పుడు లేనంత దెబ్బ పడింది. ఇన్నేళ్ల సినిమా చరిత్రలో ఎప్పుడు లేని విదంగా సినిమా థియేటర్లు జనాలు లేక బోసిపోయాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కరెక్ట్ గా మరో లెవెల్ కు వెళుతోందన్న సమయంలోనే తీవ్ర ప్రభావం పడింది. ఇక ఇప్పట్లో అయితే మెగాస్టార్, ప్రభాస్ వంటి వాళ్ళు బిగ్ స్క్రీన్ పై కనిపించేలా లేరని అనిపిస్తోంది.

    ఆ సంతోషం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

    ఆ సంతోషం ఎక్కువ రోజులు కొనసాగలేదు.

    ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ట్రాక్ లోకి వచ్చిందని అందరూ సంతోషించారు. అనంతరం ఉప్పెన కూడా మరో లెవెల్లో హిట్టవ్వడంతో బాక్సాఫీస్ సెట్టయ్యిందని కూడా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు కొనసాగలేదు. జాతిరత్నాలు అనంతరం ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ పెరగడంతో లాక్ డౌన్ మళ్ళీ మొదలైంది.

    స్టార్ హీరోలు కూడా

    స్టార్ హీరోలు కూడా


    సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కూడా ఉంటుందనే ఊహాగానాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాలకు వెళ్లే ఆలోచన ఎవరిలోను లేదు. స్టార్ హీరోలు కూడా జనాలను ఇబ్బంది పెట్టడం రిస్క్ అని బిజినెస్ కూడా జరగదని సినిమాలను వాయిదా వేసేస్తున్నారు. కొన్ని చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.

    ఆచార్య ఎప్పుడంటే..

    ఆచార్య ఎప్పుడంటే..


    ముఖ్యంగా ఈ దసరా సమయానికి పరిస్థితులు కొంత అదుపులోకి రావచ్చని టాక్ వస్తున్నప్పటికీ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఎవరు కూడా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య దసరా తరువాత రావచ్చు గాని అంతకంటే ముందు వచ్చే అవకాశం అయితే లేదు.

    ప్రభాస్ 'రాదేశ్యామ్'

    ప్రభాస్ 'రాదేశ్యామ్'


    ప్రభాస్ రాధేశ్యామ్ కూడా దాదాపు అదే పరిస్థితుల్లో ఉంది. ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అనుకున్న సమయానికి సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశమంతా పరిస్థితులు చక్కబడినప్పుడే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

    Recommended Video

    Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
    RRR, పుష్ప కూడా లేనట్లే..

    RRR, పుష్ప కూడా లేనట్లే..

    ఇక ఈ ఏడాది రావాల్సిన బిగ్గెస్ట్ టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ RRR కూడా వచ్చే ఛాన్స్ లేదని అర్ధమవుతోంది. అక్టోబర్ లో 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటికి దర్శకుడు రాజమౌళి పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇక సుకుమార్ రాజమౌళి కంటే ఎక్కువగా ఆలోచిస్తాడు కాబట్టి పుష్ప కూడా ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని టాక్.

    English summary
    The corona lockdown has affected many industries around the world. The film industry in particular has been hit harder than ever before. Movie theaters are crowded or bored like never before in the history of cinema in these years. The Tollywood industry was also hit hard at a time when it was going to another level of correctness. Nowadays, it seems that people like Megastar and Prabhas are not visible on the big screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X