»   » మెగా ఫ్యామిలీ మీద వున్న ఇంట్రెస్ట్ తోనే అనుష్క ఓకే..!?

మెగా ఫ్యామిలీ మీద వున్న ఇంట్రెస్ట్ తోనే అనుష్క ఓకే..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ చిత్రం 'దబంగా" తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్" పేరిట రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన 'స్టాలిన్" సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మెగా ఫ్యామిలీ మీద వున్న ఇంట్రెస్ట్ తోనే 'గబ్బర్ సింగ్"లో ఐటమ్ సాంగ్ కోసం అనుష్క ఓకే అనిందని వార్తలు వస్తున్నాయి. 'మున్నీ బద్ నామ్ హుఇ..." అంటూ 'దబాంగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మలైకా అరోరా ఇరగదీసేసిన సంగతి విదితమే. అయితే 'దబాంగ్" తెలుగు వెర్షన్ 'గబ్బర్ సింగ్"లో మున్నీ ఎవరనే సస్పెన్స్ కి ఇంకా తెరపడలేదు.

పవన్ కళ్యాణ్ హీరోగా హీరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గబ్బర్ సింగ్"లో 'మున్నీ కోసం వెతుకులాట కొనసాగుతూనే వుంది. తాజాగా అనుష్క ఐటమ్ సాంగ్ కి ఒప్పుకున్నట్టు ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవెంతోగానీ, బాలీవుడ్ జనాన్ని ఊపేసినట్టే, తెలుగులో అనుష్క 'మున్నీ"గా ఇక్కడి ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి సిద్దమైతే 'గబ్బర్ సింగ్"కి అది అదనపు ఆకర్షనే అవుతుందన్నది నిర్వివాదాంశం.

కాగా గబ్బర్ సింగ్ కి ఫర్ ఫెక్ట్ చాయిస్ అనుష్క అని, సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే వేదం సినిమా తో ప్రేక్షకులను రంజిప చేసిన అనుష్క మన్నీకి కరెక్ట్ మ్యాచ్ అని అంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 9వ తేది నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది. శ్రీకాంత్ ఓ ప్రదాన పాత్రలో నటించనున్నడు.

English summary
Power star Pawan Kalyan’s fans are eagerly waiting to know who will perform the most popular item song ‘Munni Badnam Hui…’ which was played by Bollywood sexy queen Malaika Arora in its Hindi version Dabang movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu