Thaman: పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ మరొకరితో.. తమన్ సంచలన వ్యాఖ్యలు

Thaman: టాలీవుడ్ సక్సెస్ పుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ మ్యూజియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. అతడు పాటకు అందించే సంగీతం కంటే.. మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ బాగా అందిస్తాడని టాక్. తమన్ చేసిన మూవీ సక్సెస్ కావడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ కారణమే. ఇదెలా ఉంటే.. తమన్ షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో తమన్ ఏం మాట్లాడారు? ఆ వీడియో వైరల్ కావడానికి కారణమేంటీ?

వివరాల్లోకెళ్తే.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కుతోన్న మూవీ పుష్ప 2. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు.. మూవీ లవర్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ కు ఊహించిన రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ పుష్ప 2కు అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. అయితే.. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు. ఏ చిన్న లోపాలు కనిపించినా.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు పుష్ప 2 మూవీ మేకర్స్.

Tollywood Music Director Thaman shocking comments on movie makers old video viral on social media

అయితే.. పుష్ప 2 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిపోలేదని, దీంతో దేవిని పక్కన బెట్టి.. అతని ప్లేస్‌లో డైరెక్టర్ థమన్‌తో పాటు అజనీష్ లోక్‌నాథ్‌ని పుష్ప 2 లోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పుష్ప 1 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త మైనస్ అయ్యిందనని, ఎలివేషన్, క్లైమాక్స్ సీన్స్‌లో దేవీ శ్రీ ఇచ్చిన బీజీఎం సరిపోలేదని టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ జరిగిన విషయం కూడా తెలిసిందే. తాజాగా.. పుష్ప 2 కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ విషయంలో హీరో అల్లు అర్జున్ సంతృప్తి వ్యక్తం జరిగిందనీ, అందుకే దేవీ ని పక్కన బెట్టి..
తమన్‌తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే.. అఖండ, రేసు గుర్రం, సరైనోడు, అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి సినిమాలకు తమన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. ఆ మూవీ హిట్ కావడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ కారణం. అందుకే తమన్‌‌ ను పుష్ప 2 మూవీలోకి తీసుకున్నారట. తమన్ తో మరో వర్షన్ చేయించాలని సుకుమార్ భావిస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ మెరుగైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే.. దాన్ని కొనసాగించాలనీ, లేదంటే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌నే ఒకే చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నారట.

ఈ తరుణంలో కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ కూడా పుష్ప 2 లో భాగ చేసినట్టు తెలుస్తోంది. ఆయనతో పుష్ప 2 సెకండాఫ్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే.. మొత్తం పుష్ప 2 సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అజనీష్ తో ఇప్పించాలని భావిస్తున్నారట. మంగళవారం, విరూపాక్ష వంటి సినిమాలకు అజనీష్ లోక్‌నాథ్ ఎలాంటి మ్యూజిక్ అందించారో అందరికీ తెలిసిందే. ఇలా పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మూవీ మేకర్స్.

పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ని పక్కనపెట్టి ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లతో ఆర్ఆర్ చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న వేళ.. తమన్ షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో తమన్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ ల విషయంలో మూవీ మేకర్స్ అభ్యంతకరంగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం తనకు నచ్చలేదని షాకింగ్ కామెంట్ చేశారు.

Tollywood Music Director Thaman shocking comments on movie makers old video viral on social media

'కొంతమంది మూవీ మేకర్స్ సినిమాను పార్టులు గా విడగొట్టి.. ఒక పార్ట్ ఒకరితో.. మరో పార్ట్ ఇంకొకరితో.. ఒక సాంగ్ ఒకరితో.. ఆర్ఆర్ మరొకరితో చేయిస్తున్నారని, ఆ విషయం తనకు నచ్చడం లేదన్నారు. అలా సినిమాను పార్ట్ లుగా విడదీసి చేయిస్తుంటే.. 'పెళ్లి ఒకరితో.. శోభనం మరొకరితో.. చేయించినట్లుగా ఉంటుంది' అంటూ సెటైరికల్ కామెంట్ వేశారు తమన్. ఒక్కొక్క సినిమాకు ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా చేస్తున్నారో.. తను అర్థం కావట్లేదంటూ ఫీల్ అయ్యారు తమన్. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్ అవుతుంది.

ఈ రేంజ్ మేకింగ్ అవుతున్న 'పుష్ప 2' మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పుష్ప 2 రూ.1000 కోట్ల ప్రీ- రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X