ముద్దుగా పిలిచుకోవడానికి ఓ అత్త కావాలి: బాలకృష్ణ

By Sindhu

సింహా చిత్ర విజయంతో దూసుకు పోతున్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం పరమవీర చక్ర షూటింగ్ ప్రారంభానికి బాలయ్య పుట్టిన రోజైన జూన్ 10న ముహుర్తం ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంలో బాలకృష్ణ మనసులోని మనోభావాలను భయట పెట్టారు. బాలయ్య అన్వేషణలో బయటపడిందేమిటంటే..తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం అలనాటి 'సూర్యకాంతం" అంతటి నటి ఎవరు లేరని అందుకే నాగ్ తో ఆయన కలిసి చేద్దామని అనుకున్న 'గుండమ్మ కథ" రీమేక్ ఆపివేశాడని వార్తలు వస్తున్నాయి. నిజంగా బాలయ్య చెప్పింది కరెక్టే సూర్యకాంతం అంతటి నటి ఇప్పుడ ఎవరున్నారు?

అత్త అని ముద్దగా పిలిపించుకునే అటువంటి నటి..ఆమె తర్వాత ఎవరు రాకపోవడం, కాకపోవడం విశేషం, అనాటి 'గుండమ్మకథ" చిత్రాన్ని అచ్చంగా అలానే తెరకెక్కించాలని ఆ చిత్రంలో యన్టీఆర్ చేసిన పాత్ర ఆయన తనయుడు బాలకృష్ణ, అలాగే నాగేశ్వర రావు పాత్ర..ఆయన తనయుడు నాగార్జునతో తెరకెక్కించాలని బాలయ్య కన్న కలలు కలలుగానే మిగిలి పోనున్నాయా?

బుల్లితెర పై మనుసు పెడుతున్న ఓల్డ్ యంగ్ భామలలో ఒకరు ఈ అత్త పాత్రలపై మనసు పెడితే గ్యారంటీగా ఆ మహానటి అంత కాకపోయినా ఇండస్ట్రీ అత్తగా చెప్పుకోవడానికి ఓ నటి అవుతుందనే అనుకోవచ్చు. కానీ ఎవరా అత్త? ఆ దిశగా ఆలోచించే దెవరు? ప్రస్తుతం ఇండస్ట్రీలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని వచ్చే వాళ్లే కానీ మంచి పేరు కోసం వచ్చే వాళ్లు ఎంతమంది ఉన్నారు. అసలు ఉన్నారా? ఇవన్నీ అలా ఉంచితే బాలయ్య ఆవేదనతో భారీ తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ అత్తకావలని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చించుకోవడం విశేషం.

ఇక బాలకృష్ణతో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు మెహర్ రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శక్తి చిత్రంతో బిజీగా ఉన్న మెహర్ రమేష్ త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినవస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X