twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజిటల్ స్ట్రీమింగ్‌‌పై టాలీవుడ్ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం!

    |

    సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ లాంటి చిత్రాలు విడుదలైన మూడు, నాలుగు వారాలకే అమేజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

    ఓ వైపు థియేటర్లో సినిమాలు నడుస్తుండగానే డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడంతో థియేటర్లకు వెళ్లే ఆడియన్స్ కొందరు... ఇంట్లోనే చూసేయడం మొదలు పెట్టారు. మరికొందరేమో మూడు నాలుగు వారాలకే సినిమా ఇంటర్నెట్లో చూడొచ్చనే నమ్మకంతో థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన మానుకుంటున్నారు.

    నిర్మాతలకు కాసుల పంటే.. కానీ

    నిర్మాతలకు కాసుల పంటే.. కానీ

    నిర్మాతలు ఆల్రెడీ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా అదాయం పొందుతుండగా.... డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు ఆధారం వస్తోంది. ఇది తాత్కాలికంగా నిర్మాతలకు లాభం చేకూర్చినప్పకీ లాంగ్ టర్మ్‌లో ఇండస్ట్రీకి నష్టం తెస్తుందని, థియేటర్ల వ్యవస్థ మీద దెబ్బపడుతుందని నిపుణుల వాదన. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లపై ఈ ప్రభావం ఎక్కువ పడనుంది.

    డిజిటల్ స్ట్రీమింగ్‌పై కొత్త రూల్స్

    డిజిటల్ స్ట్రీమింగ్‌పై కొత్త రూల్స్

    డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 8 వారాల థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగుకు అనుమతి ఇవ్వాలని, దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అని నిర్మాతల మండలి స్పష్టం చేసింది.

    ఏప్రిల్ 1 నుంచి అమలు

    ఏప్రిల్ 1 నుంచి అమలు

    ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి రాబోతోంది. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ప్రతి సినిమాకు ఈ నిబంధన వర్తించబోతోంది. అయితే ఇప్పటికే అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, జీ5, హాట్ స్టార్ లాంటి వాటితో అగ్రిమెంట్ పూర్తయిన సినిమాలు మాత్రం 8 వారాల కంటే ముందుగానే డిజిటల్ ఫ్లాట్ ఫాంలో విుడదలయ్యే అవకాశం ఉంది.

    నిర్ణయంపై కొందరిలో అసంతృప్తి

    నిర్ణయంపై కొందరిలో అసంతృప్తి

    అయితే ఈ నిర్ణయంపై కొందరిలో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. మరో వైపు కొందరు ఆడియన్స్ కూడా కొత్త సినిమాలు వెంటనే వస్తాయనే నమ్మకంతో ఇప్పటికే ఆయా డిజిటల్ స్ట్రిమింగ్ సంస్థలకు డబ్బు కట్టి మరీ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. వారికి సైతం ఈ కొత్త రూల్ మింగుడు పడటం లేదు.

    English summary
    The Telugu Film Producers Council imposed a strict rule that Telugu films should be streamed only after 8 weeks of the theatrical release irrespective of the price the digital giants are paying. New rule will be implemented from April 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X