twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో అందమైన భామలూ..లేత మెరుపు తీగలూ..నెం.1..!?

    By Sindhu
    |

    అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అన్నాడు ఓ కవి. ఆ అందాలు ఉంటేనే గ్లామర్‌ ఫీల్డులో మరింత రాణింపు ఉంటుంది. మిస్‌ యూనివర్స్‌, మిస్‌‌ పసిఫిక్‌, మిస్‌ ‌ఇండియా వంటి వారు కూడా పోటీల్లో నెగ్గిన తర్వాత తమ అందాలను మరింత ప్రదర్శించడానికి సరైన వేదిక కోసం వెతుకుతుంటారు. చాలామంది మోడలింగ్‌ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఇందులో ఏ కొంతమందో వెండితెరపై వెలిగిపోతారు. కొందరి కళ్లు అట్రాక్షన్‌ గా ఉంటే ఇంకొందరిలో కోటేరులాంటి ముక్కు, కట్టిపడేసే ముఖ వర్చస్సు, ముత్యాల్లాంటి పలువరసు.. గిలిగింతలు పెట్టే సొట్టబుగ్గలు.. ఇలా ఒక్కోటి ఒక్కొక్కరికి ఎసెట్‌ గా నిలుస్తాయి. అయితే ఎన్ని అందమైన ఆస్తులున్నా సినిమా కథలో ఏమాత్రం తేడా వచ్చినా అవకాశాలు అలానే పోతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ లో అందాల భామల తీరు అలానే ఉంది.

    ఇలియానా దాదాపు కోటి రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం. వై.ఎస్‌.చౌదరి 'దేవదాసు' చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైంది. అయితే దానికి ముందే 'జాదు' అనే చిత్రంలో నటించింది. ఎ.ఎం.రత్నం కుమారుడు హీరోగా నటించిన ఆ చిత్రం రెండు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ బయటకు రాలేదు. దేవదాసు చిత్రంలో తన అందాలను కనపడి కనబడనట్లు చూపించి హిట్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. అలా ఒక్కో చిత్రం ఒక్కో యువ హీరోతోనూ, సీనియర్ కథానాయకులతోనూ నటించి తన పారితోషికాన్ని కోటివరకు పెంచింది. 'మల్లీశ్వరి'లో కత్రినాకైఫ్‌ కు ఆనాడు 70 లక్షలు ఇచ్చినట్లు వార్తలువెలువడ్డాయి. ఆమెను మించిన స్థాయికి ఇలియానా చేరుకుంది. అందాల భామలైన కాజల్, అనుష్క, సమంత, తమన్న, ఇలియానా, టాప్‌ 5లో ఇలియానా ఒకరు. తాజాగా తమిళం, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉంది.

    English summary
    Ileana became number one actress in the telugu film Industry within a short period of time. She mesmerized telugu viewers with her looks and hour glass figure. Ileana first telugu movie Devadasu went on to become super hit. her second film with Mahesh Babu 'Pokiri' was the biggest hit in telugu movie industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X