twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' వివాదంపై సినీ ప్రముఖుల స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ వ్యతిరేక సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు రాగా.. దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పి వెంటనే ఆ సన్నివేశాలు తొలగించారని, కానీ దేనికైనా రెడీ చిత్ర నిర్మాత మాత్రం వివాద పరిష్కారానికి ఆసక్తి చూపలేదని ది తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి ఆరోపించారు. " 'దేనికైనా రెడీ' నిర్మాతలు ఏం కోరుకుంటున్నారో తెలీదు. ఎక్కువ గొడవైతే ఎక్కువ ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. సలీమ్ సినిమా వివాదంలోనూ.. 'నా సినిమాను ఎవడు ఆపుతాడో చూస్తాను' అని మోహన్‌బాబు అన్నారు. ఆ వెంటనే తెలంగాణలో ఆ సినిమా ఆపేశారు'' అని చెప్పా రు. 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఓపెన్ డిబేట్ లో సినీ ప్రముఖులు వివాదమవుతున్న చిత్రాలపై తమ అభిప్రాయాలు తెలియచేసారు.

    రాష్ట్ర ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... " దేనికైనా రెడీ సినిమా స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే, మాట లు రాసింది, ఆ సన్నివేశాల్లో నటించిందీ బ్రాహ్మణులే. సన్నివేశాలు గతంలో అనేక సినిమాల్లో వచ్చినవే. అందువల్ల ఈ సినిమాను నిషేధించాలనడం భావ్యం కాదు. మీడియా కారణంగా వివాదాలు పెద్దవవుతున్నాయి. కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా వివాదాన్నీ చాంబర్ వైపు నుంచే కృషిచేసి పరిష్కరిం చాం. 'దేనికైనా రెడీ' విషయం కోర్టుకెక్కింది'' అని చెప్పారు.

    "సినిమాల విషయంలో సెన్సార్ ఆఫీసర్‌ను తప్పు పట్టడం అనవసరం. సమాజాన్ని అర్థం చేసుకుని మనమే సినిమాలు తీయొచ్చు. బ్రాహ్మణ వర్గమంతా ఇలాగే ఉంటుందనేలా చిత్రించడం కరెక్ట్ కాదు. దర్శకులు, రచయితలకు అవగాహన సదస్సులు పెట్టాలి'' అని 'కొమరం భీమ్' దర్శకుడు అల్లాణి శ్రీధర్ సూచించారు. 'గంగపుత్రులు', 'ఒక రొమాంటిక్ క్రైమ్‌స్టోరీ' చిత్రాల దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ " సినిమావారికి సెల్ఫ్ సెన్సారింగ్ ఉం డాలి. సినిమాలు తీసేప్పుడు ప్రజల మనోభావాలనూ దృష్టిలో ఉంచుకోవాలి'' అన్నారు.

    'సంభావన ఇస్తే మీరు తోక ఊపుకుంటూ వచ్చేస్తారు రా' అన్న 'దేనికైనా రెడీ' లో డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేయగా, అది కేవలం ఒక పాత్రను ఉద్దేశించి మాత్రమే రాసినదని రచయిత కోన వెంకట్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ... "వినోదం అందించాలనే ఉద్దేశంతోనే పాత్రలు, సన్నివేశాలు కల్పిస్తుంటాం. సంభాషణలు రాస్తుంటాం. ఈ చిత్రంలో కారణం లేకుండానే వివాదం పెరిగిపోయింది'' అని అన్నారు.

    ఉద్యమకారుల కంటే కెమెరా ముందుకు రావాలని వచ్చేవాళ్లే ఎక్కువని దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి ఎవరొచ్చినా 'మావారిలాగే ఉన్నారు' అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించగా, గతంలో జంధ్యాల ఓ సినిమాలో శ్రీలక్ష్మి పాత్రను ఆ తరహాలో చిత్రించారని కల్యాణ్ అన్నారు.

    English summary
    
 Telugu film producers' association also backed Mohan Babu. They found fault with the organisations attacking theatres, houses of filmmakers and other property.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X