For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ వెహికిల్ కొన్న టాలీవుడ్ నిర్మాత.. దాని ఖరీదు ఎంతంటే?

  |

  ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును కొనుగోలు చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన నిర్మాత.. అజయ్ మైసూరు. సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని ఈయనే నిర్మించారు. ఆస్ట్రేలియాలో ఉండే అజయ్.. సినిమాలపై ఆసక్తితో 2019 నుంచి నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు. నాటి నుంచి తెలుగు, తమిళంలో సినిమాలు, షార్ట్ వీడియోలను నిర్మిస్తూ ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన కొనుగోలు చేసిన కారుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ సంగతి ఏంటంటే..

  వర్మ ట్వీట్​తో వైరల్​..

  వర్మ ట్వీట్​తో వైరల్​..

  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అజయ్ గురించి చేసిన ఓ ట్వీట్ వైరల్​గా మారడం సహా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఓ కారుతో పాటు అజయ్ మైసూర్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్​యూవీ.. ఆస్టన్​మార్టిన్ డీబీఎక్స్707​ను ఖరీదు చేసిన అజయ్ మైసూర్​కు కంగ్రాట్స్. దానిపై కేజీయఫ్ నెంబర్​ ప్లేట్స్​ని మిస్ చేయకండి. కేజీయఫ్​ సినిమా, హీరో యశ్​ స్ఫూర్తితో ఆయన ఇలా చేశారు.. అని వర్మ ట్వీట్ చేశారు.

  విలాసవంతమైన జీవనం..

  విలాసవంతమైన జీవనం..

  ఈ ట్వీట్​కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా నిర్మాత అయినప్పటికీ అజయ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెటిజన్లలో ఏర్పడింది. దీంతో అతడి సామాజిక మాధ్యమాలను జల్లెడ పడితే.. అతడి గురించి తెలుసుకొని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. అజయ్ మైసూర్ ఎంతో స్టైలిష్, లావిష్ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటారు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు, చుట్టూ అమ్మాయిలు.. ఇలా ఎంతో ఆకర్షణీయమైన లైఫ్​స్టైల్​ను ఆస్వాదిస్తున్నారు. శునకాలన్నా ఆయనకు ప్రేమే.

  వీటితో సినిమా రంగంలో గుర్తింపు..

  వీటితో సినిమా రంగంలో గుర్తింపు..

  ఇక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్​ అనే సంస్థను స్థాపించారు. 2019లో ఆద్య అనే షార్ట్​ వీడియో, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా, 2021లో డర్టీ నాస్టీ అఫైర్, ది గర్ల్ విత్ ఏ స్ట్రేంజర్ అనే షార్ట్ వీడియోలను నిర్మించారు. ఈ రెండు షార్ట్ వీడియోలకు కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించడం విశేషం. వాటితో ఆశించిన ఫలితాన్నే రాబట్టగలిగారు అజయ్. ఇక సీనియర్ హీరో శ్రీరామ్, అవికా గోర్ జంటగా నటించిన 10 క్లాస్ డైరీస్ అనే చిత్రం కూడా ఆయన బ్యానర్​లోనే తెరకెక్కింది. ప్రస్తుతం ది హ్యాంగ్​ మ్యాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు అజయ్.

  పవన్​ బర్త్​డే సందర్భంగా.. యశ్​పై అభిమానంతో..

  పవన్​ బర్త్​డే సందర్భంగా.. యశ్​పై అభిమానంతో..


  ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు కొనడంతో మరోసారి సంచలనంగా మారారు అజయ్ మైసూర్. జనసేన అధినేత, పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట​న్ మార్టిన్​ను కొనుగోలు చేసినట్లు ఆయన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశారు. దీనిపట్ల పవన్ అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన కేజీయఫ్ సినిమా, హీరో యశ్​ పట్ల అభిమానంతో ఆ కారు నెంబర్ ప్లేట్​పై కేజీయఫ్ అనే ఆంగ్ల అక్షరాలను వేయించారు. ఈ నెంబర్ ప్లేట్​ను యశ్​కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు అజయ్.

   దీని ధర తెలిస్తే షాకే..

  దీని ధర తెలిస్తే షాకే..

  ఇక మోడల్, స్పీడ్, ఫీచర్ల పరంగా ఆస్టన్ డీబీఎక్స్ 707కు భారీ డిమాండ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్​లో దీని ధర సుమారు రూ.4.50కోట్లు (ఎక్స్​ షోరూమ్ అంచనా). అయితే దేశంలో ఈ మోడల్ కార్లు ఎక్కువ లేకపోవడం వల్ల కొనాలనుకునేవారికి కాస్త నిరాశ తప్పదు.

  English summary
  Tollywood producer ajay mysore bought the fastest SUV in the world aston martin DBX707. director ram gopal varma tweets and congratulates him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X