పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్.. దేవుడికి దూరం కావడానికి కారణం!

Recommended Video

Tollywood Producer Bandla Ganesh Joins Congress Party

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బండ్ల గణేష్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతో గణేష్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

అనూహ్యంగా నిర్మాతగా

అనూహ్యంగా నిర్మాతగా

బండ్ల గణేష్ చిన్న పాత్రలు చేసుకుంటూ చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. 2009 లో అనూహ్యంగా రవితేజ చిత్రం ఆంజనేయులుతో బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు. ఆ తరువాత టాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.

దశ మార్చిన గబ్బర్ సింగ్

దశ మార్చిన గబ్బర్ సింగ్

బండ్ల గణేష్ మొదట నిర్మించిన రెండు చిత్రాలు ఆంజనేయులు, తీన్మార్ పరాజయం చెందాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మించిన తీన్ మార్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా పవన్ వరుసగా రెండోసారి గణేష్ కు అవకాశం ఇచ్చాడు. ఈ సారి నిర్మించిన గబ్బర్ సింగ్ చిత్రంలో తిరుగులేని విజయం సాధించింది. ఆ చిత్రంలో నిర్మాతగా గణేష్ జతకమే మారిపోయిందని చెప్పొచ్చు.

అదే ఊపులో

అదే ఊపులో

గబ్బర్ సింగ్ ఇచ్చిన ఉత్సాహంతో గణేష్ వరుసగా సినిమాలు నిర్మించాడు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. గబ్బర్ సింగ్ తరువాత బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్ వంటి చిత్రాల్ని గణేష్ నిర్మించాడు.

పవన్‌ని ఆకాశానికెత్తుతూ

పవన్‌ని ఆకాశానికెత్తుతూ

గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్, గణేష్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఏ వేడుకకు వెళ్లినా గణేష్ అక్కడ పవన్ కళ్యాణ్ ని ప్రశంసలతో ముంచెత్తేవాడు. కానీ గణేష్ తాజాగా కాంగ్రెస్ ఆపార్టీలో చేరడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అని చెప్పొచ్చు.

రాహుల్ గాంధీ సమక్షంలో

రాహుల్ గాంధీ సమక్షంలో

ఢిల్లీ వెళ్లిన గణేష్.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నాడు. చాలా కాలం నుంచి బండ్ల గణేష్ రాహుల్ గాంధీ, మరికొందరు పొలిటీషియన్స్ తో టచ్ లో ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్ నా తండ్రి

పవన్ కళ్యాణ్ నా తండ్రి

పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉంటారు.. ఆయన పార్టీలో ఎందుకు చేరలేదు అని విలేకరి ప్రశ్నించగా గణేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నా తండ్రి లాంటి వారు. దేవుడితో సమానం. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి గౌరవం అని బండ్ల గణేష్ తెలిపాడు.

బండ్ల గణేష్ అనే నేను

బండ్ల గణేష్ అనే నేను

ఎప్పటికైనా బండ్ల గణేష్ అనే నేను అంటూ ప్రమాణం చేయాలనీ అది తన కోరిక అని తెలిపాడు. సినీరంగం అంటే తనకు ప్రాణం అని చెప్పిన గణేష్ సి చేయాలనే కోరికతో రాజకీయాల్లో వచ్చినట్లు తెలిపాడు.

పవన్‌కు దూరం

పవన్‌కు దూరం

బండ్ల గణేష్ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కు దూరం కావడం అనే చర్చకు ఆస్కారం లేదు. పవన్ అంటే గణేష్ కు వ్యక్తిగతంగా ఇష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచి అయినా పోటీకి సిద్ధం అని గణేష్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X