డైమండ్ రాణిది అలాంటి మైండే.. ఏకంగా వెంకన్న స్వామినే.. రోజాపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

బండ్ల గణేష్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు . సాదాసీదా కమెడియన్‌గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి.. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల బడ్జెట్‌తో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి బడా స్టార్స్‌తో సినిమాలు తీసి నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. ఎంత వేగంగా టాప్ పొజిషన్‌లోకి వచ్చాడో, అంతే వేగంగా పరిశ్రమకు దూరమయ్యాడు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి బండ్ల బినామీ అనే రూమర్‌తో కూడా వినిపించింది. దీనికి తోడు కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఎన్నో వివాదాలు . అయినప్పటికీ నేనింతే అన్నట్లుగా ముందుకెళ్తున్నాడు బండ్ల గణేష్.

మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన గణేష్.. వేదికలపై మైక్ అందుకున్నారంటే చాలు భజన మామూలుగా ఉండదు. మనోడి ఓవరాక్షన్ కారణంగా కొన్ని ఈవెంట్లకు పిలవడం లేదని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు. రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటు వైపు వెళ్లారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున బండ్ల గణేష్ ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు. 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రచారం చేశారు. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బండ్ల గణేష్‌కు ఏదో ఒక పదవి దక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

tollywood producer Bandla Ganesh SATIRICAL Reaction On Roja 100 Crores Scam In Aadudham Andhra

తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలపైనా వ్యాఖ్యలు చేస్తుంటారు బండ్ల . స్వతహగా పవన్‌కు వీరాభిమాని కావడంతో జనసేనకు మద్ధతుగా మాట్లాడుతుంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో గతేడాది హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో పాల్గొని కన్నీటీ పర్యంతమయ్యారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా జైళ్లో పెట్టారని.. విజన్ ఉన్న నాయకుడిని జైళ్లో పెట్టినవారు మట్టికొట్టుకుని పోతారంటూ శాపనార్ధాలు పెట్టాడు. చంద్రబాబు కోసం అవసరమైతే చచ్చిపోతానంటూ వ్యాఖ్యానించాడు.

tollywood producer Bandla Ganesh SATIRICAL Reaction On Roja 100 Crores Scam In Aadudham Andhra

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి రోజాపై విరుచుకుపడుతున్నాడు బండ్ల గణేష్. నగరిలో రోజా ఓడిపోవడంతో ఆయన సెటైర్లు వేశాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రోజా ఫోటోను షేర్ చేయడంతో పాటు ''జబర్దస్త్ పిలుస్తోంది.. రా కదలిరా '' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది అప్పట్లో వైరల్ అయ్యింది. తాజాగా ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌ పోటీలలో రోజా రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారంటూ కథనాలు వస్తుండటంతో బండ్ల గణేష్ స్పందించారు. ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రోజా నూటికి నూరు శాతం స్కాం చేసే ఉంటుందంటూ ఆరోపించారు. ఇతరుల గురించి తెలియకుండా మాట్లాడనని.. స్కాముల్లో ఆమె డైమండ్ రాణి అంటూ బండ్ల గణేష్ సెటైర్లు వేశారు.

బండ్ల గణేష్ ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని.. రోజాకు ఎదురు చెప్పేవాళ్లు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఒక్క 100 కోట్లే కాదు.. ఆవిడపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బండ్ల గణేష్ డమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించినందుకు డబ్బులు వసూలు చేసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఆమె నవ్వుకునేదని.. అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయలేడని రోజా మాట్లాడిందని బండ్ల గణేష్ మండిపడ్డారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిన ఏకైక నాయకుడు పవన్ అని ఆయన స్థాయికి కొంచెం తగ్గే ఉన్నారని గణేష్ తెలిపారు. రోజా లాంటి నేతలంతా కలిసి జగన్‌ను ట్రాన్స్‌లో పెట్టారని.. నువ్వు దేవుడన్నా అంటూ మోసేసి చివరికి ఈ స్థితికి తీసుకొచ్చారని బండ్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X