నాని రెమ్యూనరేషన్ వద్దన్నాడు, కన్నీళ్లు వచ్చాయి, ఇక్కడ ఎవ్వడూ అతీతుడు కాదు: దిల్ రాజు

Recommended Video

Tollywood Producer Dil Raju Speech At Jersey Appreciation Meet || Filmibeat Telugu

నాని హీరోగా న‌టించిన జెర్సీ ఏప్రిల్ 19న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రానికి సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన చిత్ర బృందాన్ని అభినందించడానికి అప్రిషియేట్ మీట్ ఏర్పాటు చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో నాని గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

కొన్ని సినిమాలు మాత్రమే మన హృదయంలో

కొన్ని సినిమాలు మాత్రమే మన హృదయంలో

చాలా సినిమాలు వస్తాయి. అందులో సక్సెస్ మూవీస్ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే మన హృదయంలో నిలిచిపోతాయి. ‘జెర్సీ' సినిమాను రెండు వారాల ముందు చూసి ఎలా ఫీలయ్యానో... ప్రేక్షకులు, ఇండస్ట్రీ, మీడియా నుంచి కూడా అలాంటి ఫీలింగే వ్యక్తం అవుతుండటం ఆనందంగా ఉందని దిల్ రాజు తెలిపారు.

డైరెక్టర్ గ్రేట్ జాబ్

డైరెక్టర్ గ్రేట్ జాబ్

ఈ అప్రిషియేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. దర్శకుడు ఇప్పటి వరకు తీసింది ఒకటే సినిమా. పెద్దగా అనుభవం కూడా లేదు. వైఫ్ అండ్ హస్పెండ్ మధ్యలో డైలాగ్స్ లేకుండా ఒక ఎమోషన్ క్యారీ చేసిన తీరు అద్భుతంగా ఉంది. గ్రేట్ జాబ్.

ఇక్కడ ఎవ్వడూ అతీతుడు కాదు

ఇక్కడ ఎవ్వడూ అతీతుడు కాదు

ఇక్కడ ఎవ్వడూ అతీతుడు కాదు... సక్సెస్, ఫెయిల్యూర్స్ రెండూ వస్తాయి. ఎవరికైనా అన్నీ రావాల్సిందే. ఇలాంటి సినిమాలు కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. గౌతమ్ గత చిత్రం ‘మళ్లీ రావా' చూసినపుడు కూడా చాలా బాగా హ్యాండిల్ చేశావని చెప్పాను. ‘జెర్సీ' మూవీని హ్యాండిల్ చేయడం కాదు.. తాను అనుకున్న కంటెంటుకు క్రియేటివిటీ జోడించి నెక్ట్స్ లెవల్‌లో తీశాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ క్రెడిట్ గౌతమ్‌కే దక్కుతుంది.

నాని రెమ్యూనరేషన్ వద్దన్నాడని తెలిసి కన్నీళ్లు వచ్చాయి

నాని రెమ్యూనరేషన్ వద్దన్నాడని తెలిసి కన్నీళ్లు వచ్చాయి

నానికి ఆల్రెడీ నేచురల్ స్టార్ అనే పేరు ఉంది. అతడు అద్భుతమైన నటుడు. దాంట్లో డౌట్ లేదు. అతడి సినిమా ఏదైనా ఆడినా ఆడక పోయినా అందులో నేచురల్ స్టార్ కనిపిస్తాడు. ఆడే సినిమాలో నాని ఉన్నపుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాని ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయాలనుకోవడం ఒక ఎత్తయితే, ఈ సినిమా చేయడానికి రెమ్యూనరేషన్ వద్దు ప్రాఫిట్లో షేరింగ్ అడిగాడని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి.

డబ్బును దాటి సినిమాను ఎంకరేజ్ చేసినందుకు నానికి హాట్సాఫ్

డబ్బును దాటి సినిమాను ఎంకరేజ్ చేసినందుకు నానికి హాట్సాఫ్

ఒక హీరో అలా ముందుకు వస్తే తప్ప ఇలాంటి మంచి సినిమాలు రావు. సినిమా ఫీల్డులో అందరికీ డబ్బు కావాలి, ఆ డబ్బును దాటి ఇలాంటి సినిమాను ఎంకరేజ్ చేసినందుకు నానికి హాట్సాఫ్. ఈ రోజు ఏ ప్రొడ్యూసర్ అయినా నువ్వు అడిగే డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి మంచి సినిమా కోసం అలాంటి డెసిషన్ తీసుకున్నందుకు నానికి థాంక్స్.

నిర్మాత గురించి

నిర్మాత గురించి

నిర్మాత వంశీ మంచి సినిమా ఎంచుకున్నాడు. అతడికి నేను చెప్పేది ఒక్కటే.. మంచి సినిమాలు ట్రై చేయండి, అలాగే డబ్బు కూడా రావాలి. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ బావుంది. సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా బాగా చేశాడని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X