twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో వరుస విషాదాలు.. అప్పుడు సెన్సార్ ఆఫీస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన నిర్మాత మృతి!

    |

    టాలీవుడ్ లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అలాగే తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన వార్తలు మరువకముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    రెండు మరణాలు

    రెండు మరణాలు

    టాలీవుడ్ లో వరుసగా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. సరిగ్గా కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు పాడవడం గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. జరిగిన కొద్ది రోజులకే తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఊపిరితిత్తుల సమస్యతో నే ఇబ్బందిపడుతూ మరణించారు. తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే ఈ రెండు విషయాల నుంచి కోలుకోలేదు.

    నిర్మాతగా పలు సినిమాలను అందించి

    నిర్మాతగా పలు సినిమాలను అందించి

    తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది.. తెలుగులో నిర్మాతగా పలు సినిమాలను అందించిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మరణించారు.. తెలుగులో లవ్ జర్నీ అమ్మానాన్న ఊరెళితే వీడు సరైనోడు లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన జక్కుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం నాగేశ్వరరావు వయస్సు 46 సంవత్సరాలు.. ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు.

    రోడ్డు ప్రమాదానికి గురయి

    రోడ్డు ప్రమాదానికి గురయి


    గురువారం నాడు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మంటాడ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు, అయితే ఆయన అక్కడికక్కడే మరణించారు. నిజానికి గతంలో ఆయన సెన్సార్ ఆఫీసులోనే సూసైడ్ అటెంప్ట్ చేసి సంచలనం సృష్టించారు. ఎందుకంటే అప్పట్లో సిద్దార్థ్ వర్మ , విజయ , మధు , తేజ, అశ్వి , మనస్విని సుష్మిత ప్రధాన పాత్రదారులుగా సుజాతా ఆర్ట్స్ పతాకంపై అంజి శ్రీను దర్శాకత్వంలో జక్కుల నాగేశ్వరరావు 'అమ్మా నాన్న ఊరెళితే' అనే సినిమాను నిర్మించారు.

    ఏకంగా 40 కట్స్

    ఏకంగా 40 కట్స్

    అయితే అప్పటికే ప్రమోషన్స్ కోసం విడుదల చేసిన ఆ సినిమా పోస్టర్లు బూతు సీన్స్ తో నిండిన సినిమాలా ఉందనే అనుమానం కలిగించాయి. ఐతే అన్ని సినిమాల లాగానే ఈ సినిమాను కుడా సెన్సార్ కు పంపగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏకంగా 40 కట్స్ ఇచ్చి దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చారు. సినిమాలో బూతు సన్నివేశాలు ఎక్కువగా ఉండటం కారణంగానే అన్ని కట్స్ వేశారని అప్పట్లో భావించారు.

    సెన్సార్ ఆఫీసులోనే నిద్రమాత్రలు

    సెన్సార్ ఆఫీసులోనే నిద్రమాత్రలు

    అయితే అన్ని కట్స్ ఇచ్చిన తర్వాత సినిమా విడుదల చేయడం వేస్ట్ అని అప్పట్లో వాదించిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు సినిమాని రివైజింగ్ కమిటీనీ పంపారు కూడా. అయితే అప్పుడే నాటకీయ పరిణామాల్లో సెన్సార్ ఆఫీసులోనే నిద్రమాత్రలు మింగారు. అయితే హుటాహుటిన ఆయనని హాస్పిటల్ కు తరలించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

    Recommended Video

    Latest Tollywood Updates : రవితేజ మూవీలో తెలుగు అమ్మాయి స్పెషల్ సాంగ్..! || Filmibeat Telugu
    అలా సర్టిఫికేట్ తెచ్చుకుని

    అలా సర్టిఫికేట్ తెచ్చుకుని

    సెన్సార్ బోర్డు కి దర్శకుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా....పట్టించుకోకుండా, కనీసం ఆ కట్స్ కూడా అందించలేదని,. సెన్సార్ బోర్డ్ తీరు మమ్మల్ని చాలా బాధించింది. దీన్ని సవాల్ చేస్తూ తమకు న్యాయం చేయాల్సిందిగా రివైజింగ్ కమిటికి ధరఖాస్తూ చేస్తున్నామని చెప్పి ఆయన నిజంగానే రివైజింగ్ కమిటికి అప్లై చేశారు. ఈ క్రమంలో రివైజింగ్ కమిటి సినిమా మీద సమీక్ష జరిపి ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సినిమా విడుదల చేసారు కానీ పెద్ద గా ఆడలేదు. చివరిగా ఆయన శింబు, తమన్నా, శ్రియ నటించిన 'ఎఎఎ' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు.

    English summary
    Tollywood producer Jakkula Nageswara Rao passes away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X