విషాదం.. దుబాయ్ లో టాలీవుడ్ ప్రొడ్యూసర్ మృతి... ఎలా జరిగిందంటే?
టాలీవుడ్ లో విషాదం జరిగింది. ఇటీవలనే అలనాటి నటి, ప్రొడ్యూసర్ కృష్ణవేణి వయస్సు రీత్యా పైబడి తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. ఈవార్త మరిచేలోపే తాజాగా చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా ఉన్న వ్యక్తి తాజాగా కన్నుమూశారు. అది కూడా దుబాయ్ లో చనిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన మరణ వార్తను అక్కడి అధికారులు ధృవీకరించారు.
దుబాయ్ లో జరుగుతున్న ఓ ఈవెంట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వాసి అయిన కేదార్ సెలగంశెట్టి హఠాన్మరణం పొందారని దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఈవెంట్ కోసమే హైదరాబాద్ నుంచి దుబాయ్ కు కేదార్ వెళ్లారని అధికారులు చెబుతున్నారు. ఆయన మరణానికి సంబంధించి న అసలైన కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేదార్ సెలగంశెట్టి గురించి మరిన్ని వార్తలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఆయన రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీలో దొరికారని తెలుస్తోంది. కేదార్ మరణించినట్లు దుబాయ్ అధికారులు ప్రకటించడంతో పలు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.
దుబాయ్ ఈవెంట్ కు వెళ్లిన సందర్భంగా ఆయన డ్రగ్స్ వినియోగం వల్లనే చనిపోయి ఉండవచ్చునని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ ఓవర్ డ్రస్ వల్ల చనిపోయి, తుదిశ్వాస విడిచారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్ముందు ఆయన మరణవార్త వెనకున్న వాస్తవాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
ఇక కేదార్ సెలగంశెట్టి టాలీవుడ్ లోనూ పలు చిత్రాలకు ప్రొడ్యూసర్ గానూ వ్యహరించారు. ఆయన నిర్మాతగా.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో గతేడాది 'గం గం గణేశా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సినిమా ఆడియెన్స్ నుంచి మిక్డ్స్ టాక్ ను పొందింది.


Click it and Unblock the Notifications











