గోవాలో తెలుగు సినీ నిర్మాత ఆత్మహత్య.. డ్రగ్స్ ఆరోపణలతో..!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరీ అలియాస్ కేపీ చౌదరీ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గోవాలో ఆయన విగతజీవిగా పడి ఉండటం చేసిన హోటల్ సిబ్బంది.. ఆయన హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు. కేపీ చౌదరీ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని గోవా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో కేపీ చౌదరీ విషయానికి వస్తే.. కబాలీ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే కొద్దికాలంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు, డిస్ట్రిబ్యూట్ చేసిన మూవీస్ ప్లాప్ కావడంతో తీవ్రమైన అప్పులు ఉన్నాయి అని ఆయన సన్నిహితులు తెలిపారు.

అయితే సినిమాలు ఫ్లాప్ కావడంతో డ్రగ్స్ వ్యపారంలోకి అడుగుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా ఆయన డ్రగ్స్ క్రయ, విక్రయాలు జరిపారనే ఆరోపణలతో ఆయనను గోవాలో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గోవాలో ఓ పబ్‌ను కూడా నిర్వహిస్తున్నట్టు, అందులో సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే ఆరోపణలు, వార్తలు వచ్చాయి.
అయితే గోవాలో కేపీ చౌదరీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని ప్రాథమికంగా నిర్ణారణకు వచ్చారు. ధాంతో ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు గోవా పోలీసులు సమాచారం అందించారు.


Click it and Unblock the Notifications











