ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాతకి మాతృవియోగం
సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి సినిమా రంగానికి చెందిన వారో, వారి కుటుంబ సభ్యులు మృత్యు వాత పడుతున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం నెలకొంది. టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిర్మాత నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు.
నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి శానం చంద్రావతి (90) ప.గో జిల్లా స్వస్థలంలో గుండెపోటుతో మృతి చెందారు. అమ్మ ఆశీస్సులతో శ్రీ సాయి దేవ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభాకాంక్షలు- వసంతం- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే-మాణిక్యం- దొంగ దొంగది- నిన్ను చూశాక- మౌనరాగం- తదితర చిత్రాల్ని అశోక్ కుమార్ నిర్మించారు.

బుధవారం సాయంత్రం 8 గం.లకు పశ్చిమ గోదావరి జిల్లా కైకరంలో స్వగృహంలో శానం చంద్రావతి గుండెపోటుతో మరణించారు. ఆమెకు నలుగురు మగ సంతానం.. ఒక ఆడపిల్ల. ఈ నలుగురిలో రెండో సంతానం నిర్మాత శానం నాగ అశోక్ కుమార్. ఆయనకు సహచర నిర్మాతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఇండస్ట్రీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications