ఇండస్ట్రీ పరువు తీయకండి .. సుకుమార్ పై నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన సినిమాల కంటే కూడా ఎప్పుడూ వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఆయన ఏ విషయంపైనా అయినా నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. వార్తల్లో నిలుస్తారు. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలేం జరిగింది? డైరెక్టర్ సుకుమార్ పై కామెంట్స్ చేయడానికి గల కారణం ఏంటి? వివరాల్లోకెళ్తే..

ఇటీవల ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ లైంగిక ఆరోపణలు చేయడం, హీరో రాజ్ తరుణ్ పై తన మాజీ లవర్ లావణ్య ఫిర్యాదు చేయడం, నటుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసు వివాదం వంటి పలు ఘటనలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలపై నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ఘటనల వల్ల తెలుగు ఇండస్ట్రీ పరువుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొలుత రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూపై నట్టి కుమార్ స్పందిస్తూ.. ' వీరందరికీ కళామతల్లి మంచి జీవితాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ, కొంతమంది ఇండస్ట్రీ పరువును తీసివేసే ప్రయత్నాలు చేశారు. అందులో ముఖ్యంగా లైంగిక వేధింపులు, డ్రగ్స్ కేసుల దోషులను శాశ్వతంగా జైలుల్లో ఉండేలా సవరణలు తీసుకురావాలి. అలాంటి వారిని ఇండస్ట్రీ ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయదు. వారిని బహిష్కరించాలి' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అలాగే మహిళా ఆర్టిస్టులు లైంగిక వేధింపులకు బలవుతున్నారంటూ వస్తున్న వార్తలపై కూడా నటి కుమార్ స్పందించారు. ఫిలిం ఛాంబర్ ఇలాంటి కేసులను ఎంకరేజ్ చేయొద్దని, బాధితులకు అండగా నిలబడడం వరకు ఒప్పుకోవచ్చు. కానీ, అదే విషయాన్ని పదేపదే చర్చించడం సరికాదు. చాంబర్ కు మరో పని లేదా? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయాలలో మహిళలపై వేధింపులకు పాల్పడితే.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఎక్కడో.. ఎప్పుడో జరిగిన విషయాలను తవ్వి తీసుకవచ్చి చర్చించడం సరికాదు' అని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.

Tollywood producer Natty Kumar shocking comments On director Sukumar about Johnny Master issue

అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని, వారి వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందంటూ షాకింగ్ కామెంట్ చేశారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలుగా ఉన్న శ్రేష్ఠి వర్మకు డైరెక్టర్ సుకుమార్, నటి ఝాన్సీ వంటి సినీ పెద్దలు సపోర్ట్ గా నిలవడం సమంజసమే. కానీ, ఆ విషయాన్ని పదేపదే ప్రస్తావించడం సరికాదు. అలాగే.. ఆ అమ్మాయి ప్యూచర్ బాగుపడేలా చర్యలు తీసుకోవాలి. వారికి అండగా ఉండాలని పేర్కొన్నారు.

బాధితులకు చట్టపరమైన సహాయం అందించాలని, ఈ న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడూ వారి లైఫ్ ను డెవలప్ చేసుకుని ఎలా సహాయ పడాలని కోరారు. కానీ, అదే విషయాన్ని పదేపదే మీడియా ముందుకు రావడం, తరుచు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అలాంటి పనులు చేయాలనుకుంటే సినిమాలకు దూరంగా ఉండాలి. ఆ చర్యల వల్ల సపోర్టు గా నిలిచి వారి పరువు కూడా పోతుంది' అని అభిప్రాయపడ్డారు నట్టి కుమార్.

జానీ మాస్టర్ కేస్ పై నిర్మాత నటి కుమార్ స్పందిస్తూ.. ' అల్రెడీ ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి.. ఈ కేసులపై ఎవరు స్పందించవలసిన అవసరం లేదని, తరచూ మీడియా సమావేశాలు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ బాధితులకు అండగా అండగాని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ప్రధానంగా ఫిలిం ఛాంబర్ ను టార్గెట్ చేస్తూ ఎలాంటి విషయాలను ఎంకరేజ్ చేయదని వీటివల్ల ఇండస్ట్రీ పరువు పోతుందన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి తెలియదని, నిందితులు ఎవరో తేల్చాడానికి పోలీసులు,కోర్టులు ఉన్నాయని , ఇకపై అయినా ఇలాంటి విషయాలకు పుల్ స్టాప్ పెట్టాలని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నటి ఝాన్సీకు నట్టి కుమార్ సూచించారు.

Tollywood producer Natty Kumar shocking comments On director Sukumar about Johnny Master issue

అలాగే డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ.. జానీ మాస్టర్ కేసులో బాధితురాలుగా ఉన్న అమ్మాయికి డైరెక్టర్ సుకుమార్ అవకాశం కల్పించారు. ఆమెకు అండగా నిలిచారు. ఈ విషయం కోర్టులో విచారణ జరుగుతుంది. కానీ, మరోసారి బాధితురాలికి సపోర్ట్ గా నిలుస్తూ పోలీస్ స్టేషన్లో వెంబడి తిరుగవద్దని, ఆయన పేరుతో పాటు ఇండస్ట్రీ పరువు తీయవద్దు అంటూ నటి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకనైనా ఈ వివాదానికి డైరెక్టర్ సుకుమార్ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Read more about: johnny master natty kumar sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X