twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ ఇష్యూ: నిర్మాత పివిపి రూ.100 కోట్ల దావా, రోడ్డుకీడ్చే వరకు వదలనంటూ ఫైర్!

    |

    వ్యక్తిగత దూషణకు లిమిట్ అనేది ఉంటుందని, హద్దులు దాటితే ఊరుకునేది లేదు అని తెలుగు సినిమా నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి (పివిపి) హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన తాజాగా మీడియా ముందుకు వచ్చి... ఎన్నికల వేళ తనపై కొందరు చేసిన ఆరోపణలపై మండి పడ్డారు.

    తనపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగిన వ్యక్తులను, టీవీ ఛానల్స్ ఒక్కొక్కరి మీద రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నట్లు పివిపి తెలిపారు. ఇలాంటి వదిలేస్తే వారి ఆగడాలకు హద్దంటూ ఉండదని, ఇప్పుడే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

    నేను ఫిల్మ్ స్టార్‌ను బ్లాక్ మెయిల్ చేశానా?

    నేను ఫిల్మ్ స్టార్‌ను బ్లాక్ మెయిల్ చేశానా?

    ‘‘నేను ఒక ఫిల్మ్ స్టార్‌ను బ్లాక్ మెయిల్ చేశామంటూ ఆరోపణలు చేశారు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే..వందేళ్ల నుంచి ఉన్న సినీ పరిశ్రమలో నేషనల్ అవార్డ్ అందుకున్న సినిమా నిర్మాతను నేను, అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు' అని పివిపి తెలిపారు. హీరోయిన్ శృతి హాసన్ విషయంలో పివిపి మీద ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.

    మహేష్ బాబు, నాగార్జున, అనుష్కతో సినిమాలు చేశా

    మహేష్ బాబు, నాగార్జున, అనుష్కతో సినిమాలు చేశా

    ‘‘ఇప్పటి వరకు 150 సినిమాలకు ఫైనాన్స్ చేశాను. పాతిక సినిమాలు నిర్మించాను. ఇండస్ట్రీలో ఏ టాప్ స్టార్ తీసుకున్నా ఒకటి కాదు, రెండు కాదు ఐదారు సినిమాలు చేశారు. మహేష్ బాబుగారు రెండు సినిమాలు, నాగార్జునగారు 3 సినిమాలు, అనుష్కగారు 5 సినిమాలు, ఆర్యగారు 5 సినిమాలు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ కార్పొరేట్ సినిమా సంస్థమాది.'' అని పివిపి తెలిపారు.

    ఆ హీరోయిన్ మీద అందుకే కేసు వేశాం

    ఆ హీరోయిన్ మీద అందుకే కేసు వేశాం

    ‘‘సదరు ఆర్టిస్టు మాకు ఒక సినిమా సైన్ చేసి ఆ సినిమా యాక్ట్ చేయకుండా వారం రోజుల ముందు వెళ్లిపోయారు. అడ్వాన్స్ కూడా వెనక్కి రాలేదు. అందుకే సివిల్, క్రిమినల్ కేసు వేశాం. అప్పుడు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చారు.'' అని పివిపి చెప్పుకొచ్చారు.

    అలా చేయాలంటే వణికి పోవాలి

    అలా చేయాలంటే వణికి పోవాలి

    ‘‘మీకు దమ్ముంటే రాజకీయ వ్యవస్థలోకి వచ్చినపుడు మీరు చేసింది చెప్పండి. లా బ్రేక్ చేయడాన్ని అలవాటుగా మార్చుకుని, వ్యక్తిగత దూషణలకు దిగడం కాదు. ఇలా చేస్తున్న అందరిపై... వారు వ్యక్తులైనా, టీవీ చానల్స్ అయినా ఒక్కొక్కరిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నాను. ఫ్యూచర్లో ఇలా లా బ్రేక్ చేయాలంటే వణికి పోవాలి.'' అని పివిపి వ్యాఖ్యానించారు.

    ఎంత డబ్బు ఖర్చైనా పెడతాను

    ఎంత డబ్బు ఖర్చైనా పెడతాను

    ‘‘సోమవారం నుంచి మా యాక్షన్ మొదలవుతుంది. ఇది నేను ఊరికే చెప్పడం లేదు. ఎన్ని సంవత్సరాల సమయం పట్టినా, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే... ఆ వ్యక్తులను, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు నిద్రపోను. నన్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అన్నారు. ఊరిని దోచుకోవడానికి వచ్చాడు అన్నారు. ఇాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను, మీడియా సంస్థలను రోడ్డు మీదకు ఈడ్చివేయకపోతే ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది.'' అని పివిపి చెప్పుకొచ్చారు.

    English summary
    Tollywood Producer Prasad V Potluri To File Rs 100 Cr Defamation Case, who use 'Lawbreaking' as their birth rights. The industrialist turned politician said he has no personal grudge against anyone and added that he will do positive and protective politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X