twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా పేర్లతో చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బడా నిర్మాత

    |

    విజయవాడ వేదికగా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలు బహిరంగంగానే మాటల యుద్దానికి తెర లేపిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీలో అలజడి నెలకొంది. అదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మధ్య కూడా కొద్దిరోజులుగా రచ్చ జరుగుతోంది. ఇది చినికి చినికి గాలి వానలా మారింది. దీంతో బెజవాడ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి.

    ఎవరూ తగ్గడం లేదు

    ఎవరూ తగ్గడం లేదు

    గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన కేశినేని నాని - పీవీపీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. వీళ్లు చేసుకుంటున్న విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పటికే పలు అంశాలపై ట్వీట్లు చేసుకున్న ఈ ప్రత్యర్థుల్లో ఎవరూ తగ్గడం లేదు.

     జగన్‌కు నాని ట్వీట్

    జగన్‌కు నాని ట్వీట్

    పీవీపీని ఉద్దేశిస్తూ కేశినేని నాని.. ముఖ్యమంత్రి జగన్‌‌మోహన్ రెడ్డికి ట్వీట్ చేశారు. ‘అయ్యా జగన్ రెడ్డి గారు అసలే బ్యాంకుల పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగ నీతులు చెప్పమనండి.. లేకపోతే నిమ్మగడ్డ కు పట్టిన గతే పడుతుంది' అని అందులో పేర్కొన్నారు.

    చంద్రబాబుకు పీవీపీ ట్వీట్

    కేశినేని నాని చేసిన ట్వీట్‌కు పీవీపీ కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు.. తమరు రోడ్లు మీద కార్న్ తింటూ కులాసాగా తిరుగుతున్నారు. ఇక్కడ మీ సహచరుడు శ్రీ. ఇస్మార్ట్ నాని వ్యాపారాలు మూసేసి అందరిని రోడ్డున పడేసి బెజవాడను దివాలా తీస్తున్నాడు. తమరు దయచేసి,ఆ హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు,ఓ కప్పు కాఫీ ఇస్తాం' అని అందులో చెప్పారు.

    సినిమాల పేరుతో


    పీవీపీ ఈ ఒక్క ట్వీట్‌తోనే ఊరుకోలేదు. చంద్రబాబు పేరును ఉద్దేశిస్తూ ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కమింగ్ సూన్: బ్లాక్ బస్టర్స్... మాయా దేశం, బొబ్బిలి పిల్లి, మైనర్ ‘చంద్ర'కాంత్, సర్దార్ పప్పల రాయుడు, అడవి చంద్రుడు, సమర చంద్రా రెడ్డి, నరకాసుర నాయుడు, కొండవీటి శునకం, ఇన్జస్టీస్ చౌదరి, వెన్నుపోటు వేటగాడు, జై తారక రామ' అని అందులో రాసుకొచ్చారు.

    English summary
    The Canara Bank is getting ready to auction the properties of YCP leader Potluri Vara Prasad (PVP), as part of recovering the loan amount of Rs 148.90 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X