కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిన సురేష్ బాబు.. మా తండ్రికి గుర్తుగా!

Recommended Video

Suresh Babu Rejects KCR Offer

టాలీవుడ్ బడా నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఓ ఆఫర్ ని సురేష్ బాబు సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ లోనే మరో స్థాయికి చేర్చాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ తరలి వచ్చాక టాలీవుడ్ సొంతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు టాలీవుడ్ తరలిపోతుందనే వాదన ఉన్నపటికీ ఆ పరిస్థితులు కనిపించడం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. హైదరాబాద్ లోనే మరింతగా టాలీవుడ్ ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేశారు.

సినీప్రముఖులతో

సినీప్రముఖులతో

టాలీవుడ్ స్థాయిని పెంచే క్రమంలో కేసీఆర్ సినీప్రముఖులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ నిర్మాత సురేష్ బాబుకు ఓ ఆఫర్ ఇచ్చారని, కానీ దానికి సురేష్ బాబు అంగీకరించలేదని అంటున్నారు.

ఆఫర్ ఏంటంటే

ఆఫర్ ఏంటంటే

టాలీవుడ్ లో రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో బాగా పాపులర్ అయ్యాయి. ఈ స్టూడియోల పేరుతో కమర్షియల్ సెంటర్స్ నిర్మించాలని కేసీఆర్ సూచించారు. అందుకు సంబందించిన భూమిని హైదరాబాద్ శివారులో ఇస్తామని తెలిపారట.

నాన్నగారి కల

నాన్నగారి కల

ఈ విషయం గురించి సురేష్ బాబు స్పందించారు. ప్రభుత్వం నుంచి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే అని సురేష్ బాబు అన్నారు. రామానాయుడు స్టూడియో అనేది తమ తండ్రి కల. స్టూడియో నిర్మించడం అంత సులువైన విషయం కాదు. కానీ మా నాన్న ఎన్నో కష్టాలు పడి ఈ స్టూడియోని నిర్మించారని సురేష్ బాబు అన్నారు.

ఎప్పటికి ఇలాగే

ఎప్పటికి ఇలాగే

రామానాయుడు స్టూడియోని మా నాన్నకు గుర్తుగా ఎప్పటికీ ఇలాగే ఉంచుతామని సురేష్ బాబు అన్నారు. ఈ స్టూడియోని వేరే రకంగా మార్చే ఉద్దేశం లేదని సురేష్ బాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X