సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాతకి మాతృవియోగం
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందారు. అకస్మాత్తుగా హెల్త్ ప్రోబ్లమ్ రావడంతో అతనిని గాంధీ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ ఇచ్చారు. అవయవాలు దెబ్బతినడంతో ఆయన మృతి చెందారు. తాజాగా మరో మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి టీజీ గీతాంజలి ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. ఆమె వయస్సు 70 ఏళ్ళు. గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆమె బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె కోలుకోలేదు.

దీంతో తల్లి చివరి కోరిక మేరకు విశ్వప్రసాద్ ఆమెని వారణాసికి తీసుకొని వెళ్ళారు. అక్కడ దైవదర్శనం చేసుకున్న తర్వాత గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గీతాంజలి పెద్ద కుమారుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇక వారణాసిలోనే గీతాంజలి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక విశ్వ ప్రసాద్ మాతృమూర్తి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక వారణాసిలో అంత్యక్రియలు ముగించుకొని వచ్చిన తర్వాత పెద్దకర్మ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మొదటి చిత్రంగా A 1 ఎక్స్ ప్రెస్ సినిమా వచ్చింది. ఈ మూవీ ఎవరేజ్ అయ్యింది. దీని తర్వాత శ్రీవిష్ణుతో రాజరాజచోర మూవీచేశారు. ఇది పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. తరువాత మెల్లగా వారి సినిమా బడ్జెట్ లు కూడా పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, తేజ్ కాంబినేషన్ లో బ్రో మూవీ ఈ బ్యానర్ నుంచి రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే ప్రభాస్ తో రాజా డీలాక్స్ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











