వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు (ఫోటోస్)
హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు ఎర్రగడ్డ శ్మషానవాటికలో మంగళవారం ముగిసాయి. ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీబీ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై అంతిమ వీడ్కోలు పలికారు.
ఫిల్మ్ చాంబర్లో కాకాకుండా ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం పెడదామని తొలుత జగపతి బాబు సూచించినప్పటికీ....తర్వాత పెద్దల సూచనతో ఫిల్మ్ చాంబర్ కు తీసుకు వచ్చారు. పలువురు సినీరంగ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రగడ్డ శ్మషానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
స్లైడ్ ఫోలో ఫోటోలు...

చిరంజీవి
వీబీ రాజేంద్రప్రసాద్‌కు నివాళులు అర్పిస్తున్న చిరంజీవి

అంత్యక్రియలు
వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఎర్రగడ్డ శ్మషాన వాటికలో జరిగాయి.

కన్నీటి పర్యంతం
వీబీ రాజేంద్రప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.

దహన సంస్కారాలు
ఎర్రగడ్డ శ్మసాన వాటికలో జరిగిన దహన సంస్కారాల్లో జగపతి బాబు.

అర్జున్
ప్రముక దక్షిణాది నటుడు అర్జున్ కూడా వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

వారసులు
వీబీ రాజేంద్రప్రసాద్ వారసులు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

అభిమానులు, ప్రముఖులు
అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.

వెంకటేష్
వీబీ రాజేంద్రప్రసాద్ గురించి మాట్లాడుతున్న ప్రముఖ నటుడు వెంకటేష్.

వివి వినాయక్
వివి వినాయక్, తమ్మారెడ్డి తదితరులు వీబీ రాజేంద్రప్రసాద్ కు నివాళులు అర్పించారు.

ఆర్ నారాయణ మూర్తి
వీబీ రాజేంద్రప్రసాద్ కు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతున్న ఆర్ నారాయణ మూర్తి.

రాఘవేంద్రరావు
వీబీ రాజేంద్రప్రసాద్ కు నివాళులు అర్పించడానికి వచ్చిన రాఘవేంద్రరావు.

మోహన్ బాబు
వీబీ రాజేంద్రప్రసాద్ కు నివాళులు అర్పించేందుకు వచ్చిన మోహన్ బాబు.

సెలబ్రిటీలు
వీబీ రాజేంద్రప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులు.


Click it and Unblock the Notifications











