రాజులా బతికారు, చాంబర్‌కు తీసకెళ్లడంలేదు: జగపతి

By Bojja Kumar

హైదరాబాద్: నటుడు జగపతి బాబు తండ్రి, ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్‌(82) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. అనారోగ్యంతో హైదరాబాద్‌ ఇషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

తండ్రి గురించి జగపతి బాబు మాట్లాడుతూ...‘ఆయన జీవించినంతకాలం రాజులా బ్రతికారు. ఎవరినీ బాధ పెట్టలేదు. ఆసుపత్రి నుండి భౌతిక కాయాన్ని నేరుగా ఇంటికే తీసుకెలుతున్నాం. ఫిల్మ్ చాంబర్ కు తీసుకెళ్లడం లేదు. అభిమానుల సందర్శనార్థం ఇంటి వద్దనే ఏర్పాట్లు చేసాం' అని తెలిపారు. నటుడిగా తాను ఇబ్బందుల్లో ఉన్నపుడు కాస్త బాధ పడ్డారని, పుంజుకున్న తర్వాత సంతోషించారని తెలిపారు. మనవరాళ్ల పెళ్లి చూడాలని ఆరాట పడ్డట్లు తెలిపారు.

వి.బి రాజేంద్రప్రసాద్‌ పూర్తి పేరు వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్‌. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజేంద్రప్రసాద్‌ కుమారుడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడలో 1932 నవంబరు 4న జన్మించారు. రాఘవ కళాసమితి ద్వారా వి.బి.రాజేంద్రప్రసాద్ రంగస్థలంకు పరిచయమయ్యారు. నటుడిగా కావాలని సినిరంగంలో ప్రవేశించి నిర్మాతగా స్థిరపడ్డారు. జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థలను స్థాపించారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 1965లో అంతస్తులు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు.

 Tollywood Producer VB Rajendra Prasad Funeral details

జగపతి ఆర్ట్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ తొలుత నాటకాలు వేసేవారు. రాఘవ కళాసమితి ద్వారా ఆయన రంగస్థలానికి పరిచయమయ్యారు. నటుడు అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డారు. 1960లో అన్నపూర్ణ చిత్రంతో నిర్మాతగా మారారు. 16 చిత్రాలను నిర్మించారు. 1965లో అంతస్తులు చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దసరాబుల్లోడు చిత్రంతో ఆయన మెగాఫోన్‌ పట్టి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. మొత్తం 14 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కెప్టెన్‌ నాగార్జున, బంగారుబాబు చిత్రాలకు రచయితగా పనిచేశారు.

అక్కినేని నాగేశ్వర్‌రావుతో ఆరాధన అనే రెండో చిత్రాన్ని నిర్మించారు. తర్వాత ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెల్లు, దసరాబుల్లోడు, బంగారుబాబు, కిల్లర్, సింహస్వప్నం, భార్యాభర్తల బంధం, బంగారుబొమ్మలు, పిచ్చిమారాజు వంటి మంచి చిత్రాలను నిర్మించారు. నగరంలోని ఫిల్మ్‌నగర్‌లో దైవసన్నిధానం నిర్మాణంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించారు. అరవై, డ్బ్బై దశకాల్లో అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. 16 చిత్రాలను నిర్మించి తెలుగులో మేటి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. దసరా బుల్లోడు సినిమాతో దర్శకుడిగా మారారు. 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కెప్టెన్ నాగార్జున, బంగారుబాబు వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X