twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెంపర్ పెట్టిన చిచ్చు.. నాకు ప్రాణ హాని: బండ్ల గణేష్, అర్థరాత్రి దౌర్జన్యం: పీవీపీ

    |

    సినీ నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వీరివురు.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తమపై దాడి చేశారని ఇరువురూ ఫిర్యాదు చేశారు. అయితే బండ్ల గణేష్ ఒక అడుగు ముందుకేసి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ట్వీట్లు పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. వీరిద్దరి మధ్య రేగిన ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

    Recommended Video

    PVP Gives Police Complaint On Bandla Ganesh || టెంపర్ సినిమా వల్లే..!!
    కాపాడంటూ సీఎం జగన్ కు ట్వీట్లు..

    కాపాడంటూ సీఎం జగన్ కు ట్వీట్లు..

    'గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి'..అంటూ ట్వీట్ చేసారు. దీనికి కొనసాగింపుగా.. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు.

    తులసీ వనంలో గంజాయి మొక్క

    తులసీ వనంలో గంజాయి మొక్క

    ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే... ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సూచించారు. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు.

    టెంపర్ సినిమాతో మొదలైన వివాదం

    టెంపర్ సినిమాతో మొదలైన వివాదం

    బండ్ల గణేష్ తనపై దాడికి పాల్పడ్డాడని పీవీపీ కూడా ఫిర్యాదు చేయడం ఇక్కడ కొసమెరుపు. పీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించినటెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన మొత్తానికి గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్‌ను పీవీపీ కోరారు.

    అనుచరులతో బెదిరించాడంటూ ఫిర్యాదు

    అనుచరులతో బెదిరించాడంటూ ఫిర్యాదు

    ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్‌ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

    English summary
    Tollywood Producers Bandla Ganesh And PVP Are Compalined Each Others. In Finance Issue Of Temper Movie Issues Is raised. Both FiledCase Agaimst Each Other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X