షూటింగ్స్ లో కేవలం 50 మంది మాత్రమే ఉండాలి.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తెలంగాణరాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా తీవ్రత మరింత తీవ్రంగా మారుతోంది. అన్ని రకాల వయసులో ఉన్న వారు కరోనా బారిన పడుతున్నారు. మునుపటి కన్నా సెకండ్ వెవ్ లోనే కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మరణాల సంఖ్యను ఆపలేకపోతున్నారు.
ఇక షూటింగ్స్ లలో కూడా కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇది అందరికీ సంబంధించిన విషయం అంటూ.. ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ కండిషన్ లో, అవసరమైన మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. షూటింగ్ / పోస్ట్ ప్రొడక్షన్స్ అత్యవసరం అనుకుంటే తప్పని పరిస్తుతులలో 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలని అధికారికంగా వివరణ ఇచ్చారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వ్యాప్తి గాలి ద్వారా కూడా తీవ్రరూపం దాలుస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణాలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో కేవలం 50% ఆక్యుపెన్సీ ద్వారా సినిమా థియేటర్లు కొనసాగాలని హెచ్చరించారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు వాయిదా పడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











