twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త రూల్స్: పెద్ద నిర్మాతల ఆగడాలకు ఇక చెల్లవు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను ఆదుకునే దిశగా.... పెద్ద సినిమాల నిర్మాతల ఆగడాలకు కళ్లెం వేసే దిశగా నిర్మాతల మండలి కొత్త నిర్ణయం తీసుకుంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్న తేదీనే విడుదల చేయాలని, ఒక వేళ అప్పుడు విడుదల వీలుపడక పోతే కనీసం నాలుగు వారాలు వాయిదా వేసుకోవాలనే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1, 2016 నుండి దీన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాలు ఇష్టం వచ్చినట్లుగా రిలీజ్ డేటు మారుస్తూ వాయిదా వేసారు. దీంతో చిన్న సినిమాల రిలీజ్ షెడ్యూల్ అస్తవ్యస్తం అయి తీవ్రంగా నష్టపోయాయి. బాహుబలి, శ్రీమంతుడు, రుద్రమదేవి, అఖిల్ లాంటి సినిమాలు రిలీజ్ ఎన్నిసార్లు వాయిదా పడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలు నష్టపోవడంతో పాటు ప్రేక్షుకుల్లోనూ అయోమనం నెలకొంది.

    Tollywood Producers council New rules

    రిలీజ్ డేట్ల విషయంలో కొందరు పెద్ద నిర్మాతలు క్రమశిక్షణగా మెలగక పోవడమే ఇందుకు కారణం. వారి కారణంగా చిన్న సినిమాలు రిలీజ్ డేట్లు దొరకక ఇబ్బంది పడటంతో పాటు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి నిబంధనలు ఇప్పటికే బాలీవుడ్ తో పాటు, కోలీవుడ్లో అమలవుతున్నాయి. తాజాగా టాలీవుడ్లో కూడా అమల్లోకి రావడం హర్షణీయం అంటున్నారు.

    నిబంధనలు అమలులోకి వస్తే ఇటు చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు క్రమశిక్షణగా మెలగడంతో పాటు.... రిలీజ్ డేట్ విషయంలో ప్రేక్షకుల్లోనూ ఎలాంటి అయోమయానికి తావు లేకుండా అవుతుంది. మరి ఈ కొత్త రూల్స్ ఏ మేరకు విజయవంతంగా అమలు అవుతాయో? చూడాలి.

    English summary
    "New rule from 2016 in Producers council stating Biggies to stick to announce dates or Postponement is minimum 4 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X