twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Producers meeting:షూటింగ్స్ బంద్ పై కీలక నిర్ణయం.. కానీ ఆరోజే క్లారిటీ!

    |

    టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా కరోనా వంటి విపత్కర పరిస్థితులతో పాటు సినిమా టికెట్ రేట్ల వంటి విషయాలు ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చాలదు అన్నట్టుగా ఇటీవల సినీ కార్మికులు నిరసన చేపట్టారు. గత నాలుగేళ్లుగా తమకు జీతాలు పెంచడం లేదంటూ సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలు పెంచేదాకా షూటింగ్ లకు వెళ్ళిపోయేది లేదంటూ ఆందోళన చేపట్టారు.

    కానీ సినీ పెద్దలు మాత్రం ఇలా అర్ధాంతరంగా సినిమాలను ఆపేస్తే నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని, అందుకే సినీ కార్మికులు తక్షణమే విధులకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. పైగా ఈ విషయాలను తర్వాత సామరస్యంగా పరిష్కరించుకుందామని సలహా కూడా ఇచ్చారు. కానీ అవేవీ పని చేయలేదు. ఎటకేలకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలగజేసుకుని సినీ పెద్దలతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేయగలిగారు.

    ఇక ఇప్పుడు టాలీవుడ్ ను మరో సమస్య పట్టుకుంది. టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ కానున్నాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ షూటింగ్ లు మొత్తానికే బంద్ చేయాలా? లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ చిత్రాలను యధాతధంగా కొనసాగించి, కొత్త సినిమాలు మాత్రం స్టార్ట్ అవ్వకుండా ఆపాలా ? అనే విషయాలపై చర్చిస్తున్నామని, ప్రేక్షకులకు టికెట్ రేట్లు కూడా అందుబాటులోకి తేవడం, ఓటిటి వంటి పలు అంశాలను చర్చిస్తున్నామని వెల్లడించారు.

    Tollywood Producers meeting about shootings bandh

    ఫిలిం ఛాంబర్ ఈ వివాదంపై ఈనెల 23న అన్ని సినిమా విభాగాల ప్రతినిధులతో సమావేశం అయ్యి అంతిమ నిర్ణయం తీసుకుంటుందని నిర్మాత సి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేసింది.

    ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, మోహన్ వడ్ల పట్ల, నట్టి కుమార్, అభిషేక్ నామా, జెమిని కిరణ్, వైవిఎస్ చౌదరి, ఎలమంచిలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఓటీటీ, టికెట్ ధరలు, విపిఎఫ్ చార్జీలు, ఫైటర్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, రేట్లు, నటీనటులు, టెక్నీషియన్స్, సినిమా నిర్మాణం విషయంలో మేనేజర్ల పాత్ర వంటి విషయాలపై చర్చించారు.

    కరోనా కారణంగా సినిమా నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతుందని, ఒకవైపు ప్రజలు థియేటర్లలోకి రావడం మానేయగా, మరో వైపు టికెట్ రేట్లు ఓటీపీ వంటి సమస్యలు నిర్మాతలను కలవరపెడుతున్నాయని ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయానికి వచ్చారు. మరి త్వరలో సినిమా షూటింగ్ లు ఆగిపోనున్నాయా? లేదంటే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి పెద్దలంతా కలిసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారంతో రాబోతున్నారా? అనేది వేచి చూడాలి.

    English summary
    No clarity at tollywood Producers meeting about shootings bundh held at hyderabad on 21st july
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X