ముందు జగన్ తో నాగార్జున భేటీ.. ఇప్పుడు నానితో దిల్ రాజు భేటీ.. మరుసటి రోజే ఎందుకు..ఏం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలుగు టాలీవుడ్ అనేక చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు సహా అనేక విషయాలలో తమను కాస్త ఆదుకోవాల్సిందిగా టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని తో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయ్యింది. అసలు ఎందుకు భేటీ అయింది? అసలు ఏమైంది ? అనే వివరాల్లోకి వెళితే.

నానితో దిల్ రాజు భేటీ

నానితో దిల్ రాజు భేటీ

సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో అమ్మడానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో మంత్రి పేర్ని నాని తో సినీ నిర్మాతల భేటీ అయ్యారు. మంత్రి పేర్ని నాని తో దిల్ రాజు, అలంకార్ ప్రసాద్ సహా మరికొంత మంది నిర్మాతలు కలిసి అనేక విషయాల మీద చర్చలు జరిపారు.

ఆన్ లైన్ లో సినిమా టికెట్లు

ఆన్ లైన్ లో సినిమా టికెట్లు

సినీ రంగానికి సంబంధించిన అనేక విషయాలతో పాటు సినిమాటోగ్రఫీ చట్ట సవరణ, ఆన్లైన్ ;ప్ టికెట్ విక్రయాల గురించి ప్రధానంగా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మాలని మేమే కోరామని చెబుతున్న నిర్మాతలు ఈ విషయంలో అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిర్మాతలు భేటీ అయ్యారు కానీ ఈ విషయం మీద ఒక కొలిక్కి రాలేకపోయింది.

సంచలనంగా

సంచలనంగా

ఈ క్రమంలోనే టాలీవుడ్ కింగ్ నాగార్జున గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయి భోజనం కూడా చేస్తూ చాలా సేపు మాట్లాడారు.నాగార్జునతో పాటు నిరంజన్ రెడ్డి, ప్రీతం రెడ్డి అనే ఇద్దరు నిర్మాతలు కూడా వచ్చి భేటీ అయినట్లు ప్రచారం జరిగింది.. అది జరిగిన మరుసటి రోజే దిల్ రాజు సహా మరికొంత మంది నిర్మాతలు వచ్చి పేర్ని నాని తో భేటీ కావడం సంచలనంగా మారింది..

సమాచారం అందించేందుకు

సమాచారం అందించేందుకు

దీని వెనుక ఏమి కారణాలు ఏమేం ఉన్నాయా అని ఆరా తీస్తుంటే సమావేశం పూర్తి అయిన తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తన మంచి కొంత సమాచారం కోరడంతో ఆ సమాచారం అందించేందుకు కలిశామని దిల్ రాజు వెల్లడించారు. మరో పక్క గురువారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసే ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించింది.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
పూర్తిస్థాయిలో విధివిధానాలు

పూర్తిస్థాయిలో విధివిధానాలు

అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడానికి ఈ చట్ట సవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ అమ్మకం మీద ఇప్పటికే కమిటీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అసెంబ్లీలో చట్ట సవరణ ఆమోదం జరిగిన వెంటనే పూర్తిస్థాయిలో విధివిధానాలు ఖరారు చేసి ఆన్లైన్ లో టికెట్లు అమ్మే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X