టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సమ్మె.. స్టార్స్ రెమ్యునరేషన్స్ కు బ్రేక్ వేసేందుకు బిగ్ ప్లాన్!
ఈ రోజుల్లో ఒక సినిమాను నిర్మించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక చిన్న బడ్జెట్ సినిమాను తక్కువలో తక్కువగా నిర్మించాలి అంటే రెండు కోట్లు అయినా ఖర్చు అవుతుంది. కరోనా రాకముందు పారితోషికాలు చాలా నార్మల్ గానే ఉండేవి. దీంతో ఒక కోటి లోపల కూడా తెరపైకి తీసుకువచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు సక్సెస్ అయితే నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వచ్చేవి. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా నష్టాల తీవ్రత అంతగా ఉండేది కాదు.
కానీ ప్రస్తుతం మాత్రం ఒక్కసారిగా చిన్న సినిమాలకు కూడా రూ.5 కోట్ల బడ్జెట్ అవుతోంది. స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే ఇతర టెక్నీషియన్స్ అందరు కూడా పారితోషికాలు చాలా ఎక్కువగా పెంచేశారు. ముఖ్యంగా హీరోలు అయితే రిజల్ట్ తో సంబంధం లేకుండా కాంబినేషన్స్ అంటూ అత్యధిక స్థాయిలో పారితోషికలు పెంచుతూ ఉండడంతో నిర్మాతలపై తీవ్రంగా ప్రభావం పడుతుంది.

సినిమాలో సక్సెస్ అయిన కూడా అనుకున్నంతగా లాభాలు ఏమీ రావడం లేదు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జనాలు థియేటర్స్ కు రావడం చాలా కష్టంగా మారిపోయింది. టికెట్ల రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అని ఆడియెన్స్ నుంచి కొంత అసహనం ఎక్కువైంది. ఇక సినిమాలకు నిర్మాణ వ్యాయామంతో పాటు రెమ్యునరేషన్స్ కూడా లెక్కకు మించి ఉండడంతో నష్టాలు వస్తే మాత్రం నిర్మాత దారుణంగా చతికిల పడిపోతున్నాడు.
ఇక ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలి అంటే నిర్మాణ వ్యాయామంతో పాటు అలాగే పారితోషికాలు కూడా చాలా వరకు తగ్గాలి అని ప్రముఖ నిర్మాతలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా సమ్మె చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఇటీవల నిర్మాతల చర్చలు జరిపినట్లు సమాచారం. రెమ్యునరేషన్స్ కు ముందుగా కళ్లెం పడితే నిర్మాతలపై భారం తగ్గుతుంది అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో నటీనటులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











