For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జున, మహేష్, పవన్, రామ్ చరణ్...ఇలా చాలా మంది స్టార్స్ పడిపోయారు!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్లో చాలా మంది స్టార్స్ ప్రేమలో పడిపోయిన వారే. ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రాగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికుల్లో ఏదో తెలియని ఆనందం. తమకంటూ ఓ రోజు ఉందనే ఉత్సాహం. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతీ రోజు ప్రేమికులు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం. ఫిబ్రవరి 14వ తేదీనే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం వెనక పెద్ద కథే ఉంది.

  క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్‌ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్‌ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది.

  దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్‌ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్‌ అభిమానుల్లో క్లాడియస్‌ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు.

  వాలెంటైన్‌ మరణించిన తరువాత రెండు దశాబ్దాలకు క్రీ.శ. 496లో అప్పటి పోప్‌, గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.

  సినిమాల ద్వారా ఈ ప్రేమ అనేది మరింత విస్తరించింది అని చెప్పక తప్పదు. పలువురు సినీ తారలు ప్రేమ వివాహాలు చేసుకుని యువతను ప్రేమవైపు నడిపించడంలో తమ వంతు ప్రయత్నం చేసారనడంలో ఎలాంటి సందేహం లేదు.

   మహేష్ బాబు, నమ్రత

  మహేష్ బాబు, నమ్రత


  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తనతో పాటు వంశీ సినిమాలో నటించిన బాలీవుడ్ భామ నమ్రత శిరోద్కర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

   జీవిత రాజశేఖర్

  జీవిత రాజశేఖర్

  తెలుగు నటి అయిన జీవిత, తమిళ నటుడు అయిన రాజశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో ఆనందమైన జీవితం గడుపుతున్నారు.

   పవన్-రేణు దేశాయ్

  పవన్-రేణు దేశాయ్

  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో పాటు బద్రి సినిమాలో కలిసి నటించిన రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డాడు. అనంతరం కొంతకాలం సహజీవనం చేసిన పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ భార్య భర్తలుగా విడిపోయినా.... వారి మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఇంకా అలానే ఉందనేది చాలా మంది అభిప్రాయం.

   శ్రీకాంత్-ఊహ

  శ్రీకాంత్-ఊహ

  పలు చిత్రాల్లో కలిసి నటించిన నటుడు శ్రీకాంత్, నటి ఊహ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇపుడు హ్యాపీగా ముగ్గురు పిల్లలతో సంతోషంగా జీవితం సాగిస్తున్నారు.

   నాగార్జున-అమల

  నాగార్జున-అమల

  తనతో పాటు పలు చిత్రాల్లో నటించిన నటి అమలను నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ ఈ ఇద్దరిలో ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

   శ్రావణ భార్గవి-హేమచంద్ర

  శ్రావణ భార్గవి-హేమచంద్ర

  సినిమా గాయకులుగా కలిసి పని చేస్తున్న శ్రావణ భార్గవి, హేమ చంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు.

   అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

   రామ్ చరణ్-ఉపాసన

  రామ్ చరణ్-ఉపాసన

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమ వివాహం చేసుకుంది.

   స్నేహ-ప్రసన్న

  స్నేహ-ప్రసన్న


  తమిళ నటులు అయిన స్నేహ-ప్రసన్న ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

   నాని-అంజన

  నాని-అంజన


  కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన నటుడు నాని, అంజన మధ్య మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

  సౌత్ స్టార్

  సౌత్ స్టార్

  సూర్య-జ్యోతిక
  తమిళ నటుడు సూర్య, నటి జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు.

   గీతా మాధురి-నందు

  గీతా మాధురి-నందు


  తెలుగు సినిమా సింగర్ అయిన గీతా మాధురి, నటుడు నందు ప్రేమ వివాహం చేసుకున్నారు.

   నాగ చైతన్య-సమంత

  నాగ చైతన్య-సమంత

  నాగ చైతన్య, సమంత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇద్దరూ కలిసి చాలా కాలంగా రహస్య ప్రేమాయణం సాగించారు.

   అఖిల్

  అఖిల్

  అక్కినేని కుర్రస్టార్ అఖిల్ కూడా చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడటమే కాదు... పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.

  English summary
  Love marriages are becoming very popular in the Telugu film industry as a series of young actors are taking this route to settle down in life in recent years. Ram Charan, Bunny, nani, Naga chaitanya, Akhil Akkineni in this love list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X