‘వీరమల్లు’పై సెలెబ్రిటీలంతా ఒకే మాట.. సోషల్ మీడియాలో రికార్డుల మోత!
హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్దమయ్యాడు. క్రిష్ తన విజన్‌తో పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతోన్నాడు. ఈ మేరకు వదిలిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు. క్రిష్ టేకింగ్, మేకింగ్‌కు చూసి ఒకే మాట అంటున్నారు.

మెగా హీరోలు అలా..
మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్ వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్‌పై ట్వీట్లు వేశారు. క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. క్రిష్ విజన్‌కు కుదోస్ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వేశాడు. వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ఇది ఎపిక్.. కళ్యాణ్ బాబాయ్ అదిరిపోయాడు అంటూ ట్వీటేశాడు.

నితిన్, నిఖిల్ ఇలా..
ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్‌పై స్పందించాడు. వారెవా రోమాలు నిక్కబొడుచుకున్నాయ్.. పవర్ స్టార్ అంటే అదే అన్నట్టుగా నితిన్ పోస్ట్ చేశాడు. ఇక నిఖిల్ పోస్ట్ చేస్తూ.. ఎపిక్ ఫస్ట్ గ్లింప్స్.. పవర్ స్టార్.. జంప్ షాట్ అదిరిపోయింది.. విజిల్స్ పడాల్సిందే అని అన్నాడు.

బండ్ల గణేష్ రియాక్షన్..
ఇది చాలా ఇంకా కావాలా? అని బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ వీరమల్లు విశ్వరూపంపై పోస్ట్ వేశాడు. దర్శకుడు బాబీ పోస్ట్ చేస్తూ.. అద్భుతమైన లుక్.. పవన్ కళ్యాణ్‌ను ఇలా ఎప్పుడూ ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ స్పందిస్తూ.. క్రిష్‌పై ప్రశంసలు కురిపించాడు. ఏం విజన్ బ్రో అదరగొట్టేశావ్.. ఇది వరకెన్నడూ చూడని పవన్ కళ్యాణ్‌న చూపించావ్ అని అన్నాడు.

ఒకే మాట..
ఇక టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని చూసి ఎపిక్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రిష్ విజన్‌కు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీరమల్లు సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నాడు.

మిలియన్ వ్యూస్..
ఫస్ట్ గ్లింప్స్ వదిలిన గంటలోపే దాదాపు మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టేసింది. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా కనిపించడం, క్రిష్ అత్యద్భుతంగా విజువలైజ్ చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలన్నీ అమాంతం వంద రెట్లు పెరిగినట్టైంది.


Click it and Unblock the Notifications











