»   » టాలీవుడ్ తెరపై బెస్ట్ లుకింగ్ జంటలు (ఫోటోఫీచర్)

టాలీవుడ్ తెరపై బెస్ట్ లుకింగ్ జంటలు (ఫోటోఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎన్నో వందల సినిమాలు నిర్మాణమవుతూ ఉంటాయి. అయితే అందులో ప్రేక్షకులకు కలకాలం గుర్తిండి పోయే సినిమాలు కొన్ని మాత్రమే. కొంత మంది నటులు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటే...కొన్ని జంటల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ అనే విధంగా ఉంటాయి.

  ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలో ఎవర్ గ్రీన్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ అనిపించుకున్న వారి విషయానికొస్తే....మొదటగా చెప్పుకోవాల్సింది సీనియర్ ఎన్టీఆర్-సావిత్రి గురించే. అప్పట్లో వీరి కాంబినేషన్ బాగా పాపులర్. ఈ ఇద్దరు భార్య భార్తలుగా నటించినా, అన్నాచెల్లెలుగా నటించినా పర్ ఫెక్ట్ గా సూటయ్యేది. రక్తసంబంధం చిత్రంలో వీరిద్దరు అన్నాచెల్లెల్లు నటిస్తే...భార్యాభర్తలుగా మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, పాండవ వనవాసం, కన్యా శుల్కం చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాణం పోసారు. ఇక మాయాబజార్ చిత్రంలో మరో ప్రత్యేకమైన పాత్రల్లో అలరించారు. వీరిని తెలుగు తెరపై బెస్ట్ ఆన్ స్క్రీన్ జంటగా చెప్పుకోవచ్చు.

  ఇక అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లోనే ఎంతో మంది నాయికలతో జత కట్టారు. అయితే ఆయనకు బెస్ట్ జోడీగా చెప్పుకోదగ్గ నటీమణి వాణిశ్రీ. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రేమ్ నగర్, సెక్రటరీ, విచిత్ర బంధం, దత్త పుత్రుడు లాంటి చిత్రాల్లో వీరు బెస్ట్ ఆన్ స్ర్కీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇతర హిట్ కపుల్ విషయానికొస్తే...శోభన్ బాబు-జయసుధ, నాగేశ్వరరావు-సావిత్ర, ఎన్టీఆర్-అంజలిదేవి తదితరులను చెప్పుకోవచ్చు.

  ఇక ఆ తర్వాతి జనరేషన్ విషయానికొస్తే...చిరంజీవి-శ్రీదేవి, చిరంజీవి-విజయశాంతి, రాధా, మీనాలను చెప్పుకోవచ్చు. ఇక నాగార్జునతో అమల, టబు, శ్రీదేవి, గిరిజా, రమ్య కృష్ణ బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకన్నారు. వెంకటేష్‌తో భానుప్రియ, రేవతి, శ్రీదేవి తదితరులు ఆన్ స్క్రీన్ పై పర్ ఫెక్ట్‌గా సూటయ్యే వారు.

  చివరగా ప్రస్తుత జనరేషన్ విషయానికొస్తే...ఈ జాబితా చాలా పెద్దగానే ఉంది. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హిట్ పెయిర్ గురించి స్లైడ్ షోలో తెలుసుకుందాం...

  ఎన్టీఆర్-సావిత్ర జంట సెల్యూలాయిడ్ పై బెస్ట్ జంటగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి.

  ఏఎన్ఆర్, వాణిశ్రీ జంట వెండితెరపై మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ సినిమా అంటే అప్పట్లో మహా క్రేజీ.

  శోభన్ బాబు-జయసుధ అప్పట్లో బెస్ట్ జంటగా పేరు తెచ్చుకున్నారు.

  జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిరంజీవి-శ్రీదేవి బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈచిత్రంలో వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

  నాగార్జున-టబు మధ్య కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయ్యేది. వీరి కాంబినేషన్లో వచ్చిన పలు సినిమాలు పెద్ద హిట్టయ్యాయి.

  అతడు, సైనికుడు చిత్రాల్లో మహేష్ బాబు, త్రిష బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

  పవన్ కళ్యాణ్-భూమిక కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి' చిత్రం అప్పట్లో సూపర్ హిట్టయింది.

  ప్రభాస్-అనుష్క పర్ ఫెక్ట్ మ్యాచ్. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్టే

  మగధీర చిత్రంలో రామ్ చరణ్-కాజల్ బెస్ట్ జంటగా పేరు తెచ్చుకున్నారు.

  జులాయి సినిమాలో అల్లు అర్జున్-ఇలియానా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

  బొమ్మరిల్లు చిత్రంలో సిద్ధార్థ-జెనీలియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

  ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో నితిన్-నిత్యా మీనన్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.

  ఈగ చిత్రంలో నాని-సమంత బెస్ట్ జంటగా గుర్తింపు పొందారు.

  English summary
  Hundreds of Telugu movies are made every year. Few remain memorable and many don't. Very few actors stay in our memory, fewer actor-actress pair impress us. When we think about the evergreen pairs on-screen, the first couple to flash is definitely NTR and Savitri. Their on-screen presence was so adept that they made everyone believe their parts. Be it a role of brother and sister in Rakthasambandam, husband and wife in numerous movies such as Missamma, Gundamma Katha, Appu Chesi Pappu Koodu, Paandava Vanavasam, Kanya Shulkam to name a few and even as an uncle and niece in Mayabazar. They will forever remain the best on-screen couple ever.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more