twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మేము సైతం' పోగ్రాం హైలెట్స్... (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన 'మేము సైతం' కార్యక్రమానికి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. విపత్తులు సంభవించిన ప్రతిసారి బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ... ముందుకొచ్చే చిత్ర పరిశ్రమ ఈసారి కూడా తన బాధ్యతను నెరవేర్చింది. నాడు ఎన్టీఆర్‌ నుంచి మొదలైన సేవా సంస్కృతిని తాము కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. లైట్‌ బాయ్‌ దగ్గర నుంచి నిర్మాత వరకు అందరూ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.

    నిత్యం షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే తారలంతా ఒకే చోట చేరి ఉల్లాసంగా ప్రదర్శనలిచ్చారు. ఓ వైపు అన్నపూర్ణ స్టూడియోలో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు విరాళాలు వెల్లువెత్తాయి. చెన్నై, ముంబయి నుంచి కూడా కళాకారులు తరలివచ్చారు. మేము సైతం.. అంటూ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    హైదరాబాద్‌లో ఆదివారం 12 గంటలపాటు 'మేముసైతం' పేరిట టెలీథాన్‌ సాగింది. ఈ వేడుకలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సాంకేతిక నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు మేముసైతం... అంటూ పి.సుశీల బృందం పాడిన పాటతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయి.

    ఆ తర్వాత పాటలు, డ్యాన్సులు, కబడ్డీ, ముఖాముఖి, క్రికెట్టు, తంబోలా, అంత్యాక్షరి కార్యక్రమాలు సందడిగా సాగాయి. చిన్న పెద్ద, నాయకానాయికలు అనే తేడా లేకుండా నటీనటులంతా అందరూ కలిసిపోయి ప్రేక్షకులకు వినోదాలు పంచే ప్రయత్నం చేశారు.
    స్లైడ్ షోలో విశేషాలు...

    దాసరి నారాయణరావు మాట్లాడుతూ...

    దాసరి నారాయణరావు మాట్లాడుతూ...

    ''పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినవాళ్లు ప్రేక్షకులు. అలాంటివారికి కష్టాలు వచ్చినప్పుడు మేము సైతం ఏదో ఒకటి చేయాలని చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. రూపాయి అని కాదు, కోటి రూపాయలు అని కాదు కష్టంలో ఉన్నప్పుడు మేమున్నాం అని ఇచ్చే భరోసా, స్ఫూర్తికోసమే ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల సమయంలో సినిమావాళ్లు వేరు వేరు అని ప్రచారం చేస్తుంటారు. అది నిజం కాదు. తెర ఉన్నంతవరకు సినిమా పరిశ్రమ ఒక్కటే. ఈ స్ఫూర్తి రాబోయే తరమూ కొనసాగించాలి. ఇలాంటి విపత్తులు రాకూడదని మనమంతా కోరుకొందాం''.

    మోహన్‌బాబు మాట్లాడుతూ...

    మోహన్‌బాబు మాట్లాడుతూ...

    ''బాధాకరమైన విషయంలో ఓ కొత్త అనుభూతి. సినిమా పరిశ్రమ అంతా ఒక వేదికపై ఉన్నాం. మేమంతా ఒక్కటే. ప్రజలకోసం సినిమా కుటుంబమంతా ఏకతాటిపై నడిచి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాం''.

    బాలకృష్ణ మాట్లాడుతూ...

    బాలకృష్ణ మాట్లాడుతూ...

    ''చలన చిత్ర పరిశ్రమ తరఫున ఏర్పాటు చేసిన 'మేముసైతం' చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఏ ఉద్దేశంతోనైతే ఏర్పాటు చేశామో అది తప్పకుండా నెరవేరుతుంది''.

    చిరంజీవి మాట్లాడుతూ...

    చిరంజీవి మాట్లాడుతూ...

    ''తెలుగు చలన చిత్ర పరిశ్రమ మర్చిపోలేని రోజు ఇది. చాలా రోజుల తరవాత మనస్ఫూర్తిగా ఆనందించా. ప్రతీ ఒక్కరూ స్పందించి ఈ కార్యక్రమం విజయవంతమవ్వడానికి తోడ్పడ్డారు. కన్నీళ్లు తుడవడానికి మేమున్నాం.. అంటూ మేం సైతం అంటూ ముందుకొచ్చాం. ఇదో యజ్ఞం. పన్నెండు గంటల పాటు అలుపెరగకుండా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరిచ్చిన ప్రతి పైసా హుద్‌ హుద్‌ బాధితుల సంక్షేమానికి ఉపయోగిస్తామ''న్నారు చిరంజీవి.

    బాలయ్య హంగామా

    బాలయ్య హంగామా

    బాలకృష్ణ వేదికపై 'నీకంటి చూపుల్లోనే..' (లెజెండ్‌)లోని గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఓ స్కిట్‌ వేసి అలరించారు. 'ఇలా ఆటపాటలతో ఆకట్టుకోవడం 'సింహా'కే సాధ్యం' అంటూ వెంకటేష్‌ పొగిడారు.

     జోష్ తో...

    జోష్ తో...

    బాబా సెహగల్‌ రాకతో వేదికకు కొత్త జోష్‌ వచ్చింది. ఆయన 'ఆర్య 2', 'గబ్బర్‌ సింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'లోని గీతాలతో ఆకట్టుకొన్నారు. గబ్బర్‌ సింగ్‌ పాటలకు దర్శకులు, నిర్మాతలు, హాస్యనటులు వేదికపైకొచ్చి నృత్యాలు చేశారు. రాఘవేంద్రరావు సైతం కాలు కదపడం అందరినీ ఆకర్షించింది. ఇక్కడా ఆయన తన మార్క్‌ని విడిచిపెట్టలేదు. 'స్టెప్పువేయమంటే..' బంతుల్ని విసిరారు. అల్లు అరవింద్‌ పవన్‌కల్యాణ్‌లాగా వేసిన చొక్కా స్టెప్పు ప్రేక్షకుల్ని నవ్వించింది.

    .. కంటతడి పెట్టించిన బ్రహ్మీ

    .. కంటతడి పెట్టించిన బ్రహ్మీ

    బ్రహ్మానందం ఇచ్చిన సోలో పెర్‌ఫార్మెన్స్‌ అందరినీ ఆకట్టుకొంది. దాదాపు పది నిమిషాల పాటు.. వేదికపై ఆయన ఒక్కరే జోకులు చెప్పి నవ్వించారు. 'పాండవ వనవాసం'లో ఎస్వీఆర్‌ చెప్పిన డైలాగ్‌ను అనర్గళంగా వల్లించారు. చివర్లో.. 'హుద్‌ హుద్‌' బాధితులని ఆదుకొన్న ఓ మానసిక వికలాంగుడిలా మాట్లాడి అందరిచేత కంటతడి పెట్టించారు.

    ఇంటర్వూలు

    ఇంటర్వూలు

    మహేష్‌బాబు, త్రివిక్రమ్‌లను హీరోయిన్ సమంత ఇంటర్వ్యూ చేసింది. పలు ఆసక్తికరమైన ప్రశ్నల్ని సంధించింది. ఈ ప్రశ్నలకు మహేష్‌, త్రివిక్రమ్‌ తమదైన శైలిలో సమాధానాలు చెప్పి అలరించారు. మహేష్‌, త్రివిక్రమ్‌లు సమంతని పశ్నలడిగి సమాధానాలు రాబట్టారు.

    కుకింగ్ కాంపిటేషన్...

    కుకింగ్ కాంపిటేషన్...

    'బాహుబలి' బృందం వంటల కార్యక్రమంలో దిగింది. 'మీలో నన్ను ఎవరు మెప్పిస్తారో చూస్తా..' అని నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ విసిరిన ఛాలెంజ్‌కి టీమ్‌ అంతా స్పందించి రకరకాల వంటల్ని భోగవల్లి ప్రసాద్‌ ముందుంచింది. ఈ కార్యక్రమాన్ని బుర్ర కథగా మార్చి మధ్యలో 'పంచదార బొమ్మా' (మగధీర) పాటను రీమిక్స్‌ చేసి సరదాగా తెరకెక్కించారు.

    రియల్ హీరోస్...

    రియల్ హీరోస్...

    'హుద్‌ హుద్‌' విపత్తును ఎదుర్కొని, విశాఖ ప్రజలకు వివిధ రూపాలుగా సేవ చేసిన 'రియల్‌ హీరోస్‌'ని ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు.

    నాగార్జున

    నాగార్జున

    అంతేకాదు.. అనూప్‌ రూబెన్స్‌ స్వరకల్పనలో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. 'వైజాగ్‌..'పై తమకున్న ప్రేమ తెలుపుతూ నాగార్జున, వెంకట్‌, అమల, నాగచైతన్య, సుమంత్‌, సుశాంత్‌ ఈ పాటలో అభినయించారు.

    ముమైత్ అదుర్స్

    ముమైత్ అదుర్స్

    పోకిరిలో .. 'ఇప్పటికింకా నా వయసు..'అంటూ ముమైత్‌ ఖాన్‌ తన పాటలతో హోరెత్తించింది.

    రవితేజ, కాజల్..

    రవితేజ, కాజల్..

    తమన్‌ సంగీత విభావరిలో రవితేజ 'నోటంకి', కాజల్‌ చెల్లివా (బలుపు) గీతాల్ని అలపించి ఆకట్టుకొన్నారు.

    అల్లు అర్జున్ అదుర్స్..

    అల్లు అర్జున్ అదుర్స్..

    రేసు గుర్రం సినిమాలోని ...'సినిమా సూపిత్తా మావ' పాటకు అల్లు అర్జున్‌ వేదికపై స్టెప్పులేశారు.

    దేవి

    దేవి

    దేవిశ్రీ ప్రసాద్‌ ఎప్పట్లా.. ఎనర్జీతో నింపేశాడు. తన ఆటపాటలతో అలరించాడు. దేవిశ్రీ పాటలకు బన్నీ, రవితేజ వేదికలెక్కి చిందులేశారు.

    మెగా స్టెప్స్ ..

    మెగా స్టెప్స్ ..

    చిరంజీవి కూడా వేదికపైకి వెళ్లి.. 'బేగంపేట బుల్లెమ్మో..' పాటకు హుషారుగా స్టెప్పులేశారు.

    అంత్యాక్షరి..

    అంత్యాక్షరి..

    చివర్లో అంత్యాక్షరి కార్యక్రమం జరిగింది. హీరోలు, హీరోయిన్స్, గాయనీ గాయకులు అంతా నాలుగు జట్లుగా విడిపోయి పాటలు పాడుతూ హంగామా చేశారు. వెంకీ సైతం 'జామురాతిరి జాబిలమ్మా..' అంటూ గాయకుడిగా మారిపోయారు.

    వెంకీ వ్యాఖ్యానం!

    వెంకీ వ్యాఖ్యానం!

    కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బ్లాక్‌ టైగర్స్‌ (మంచు విష్ణు), రెడ్‌ పాంథర్స్‌ (మంచు మనోజ్‌) జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెడ్‌ పాంథర్స్‌ 24 - 22 పాయింట్ల తేడాతో గెలిచింది.

    రిఫరీగా...

    రిఫరీగా...

    మ్యాచ్‌కి మోహన్‌బాబు రిఫరీగా వ్యవహరించారు. వెంకటేష్‌ మధ్యలో మైక్‌ పట్టుకొని జట్లను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా బ్రహ్మానందం కూతకొచ్చినప్పుడు 'బ్రహ్మీ.. బ్రహ్మీ..' అంటూ కేకలు వేశారు. ఓ సందర్భంలో 'మోహన్‌బాబూ.. అదీ డిసిప్లేన్‌ అంటే..' అంటూ అభినందించారు.

    అదరింది...

    అదరింది...

    బ్రహ్మానందం, అలీ, సంపూర్ణేష్‌బాబు కూతకు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది.

    ఫిర్యాదు...

    ఫిర్యాదు...

    'నన్ను కొట్టడానికి ప్లాన్‌ చేశారు...' అంటూ విష్ణు మోహన్‌బాబుకి ఫిర్యాదు చేశారు.

    బ్రహ్మానందం విరుచుకు పడ్డారు..

    బ్రహ్మానందం విరుచుకు పడ్డారు..

    విరామ సమయంలో 'ఇక్కడ అన్యాయం జరుగుతోంది...' అంటూ మోహన్‌బాబుపై సరదాగా విరుచుకు పడ్డారు బ్రహ్మానందం. అందువల్ల మనోజ్‌ టీమ్‌ నుంచి క్రమశిక్షణ చర్యగా రెండు పాయింట్లు కోత విధించారు.

    హీరోయిన్ తేజస్వి..

    హీరోయిన్ తేజస్వి..

    తేజస్వి (మనోజ్‌ టీమ్‌) కూతకు వెళ్లి రెండు పాయింట్లు సంపాదించి పెట్టింది.

    క్రికెట్ హంగామా..

    క్రికెట్ హంగామా..

    కబడ్డీ మ్యాచ్‌ ముగిశాక సూపర్‌సిక్స్‌ క్రికెట్‌ మొదలైంది. నాలుగు జట్లు బరిలో దిగాయి. వెంకటేష్‌, నాగార్జున. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ రెండ్రోజుల నుంచీ జ్వరంతో బాధపడుతున్నా ఆటలోకి దిగడం విశేషం. డి.సురేష్‌ బాబు ఎంపైర్‌గా వ్యవహరించారు. అలీ వ్యాఖ్యానం ఆకట్టుకొంది.

    తొలిమ్యాచ్‌

    తొలిమ్యాచ్‌

    నాగ్‌ - ఎన్టీఆర్‌ జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచి అఖిల్‌ బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు.

    సిక్సర్లు..

    సిక్సర్లు..

    అఖిల్‌, నాగశౌర్య, అల్లరి నరేష్‌ బౌండరీలు, సిక్సర్లతో అలరించారు.

    అఖిల్..

    అఖిల్..

    అఖిల్‌ టీమ్‌ నిర్ణీత ఆరు ఓవర్లలో 73 పరుగులు సాధించింది.

    ఎన్టీఆర్... రకుల్ ప్రీతి సింగ్

    ఎన్టీఆర్... రకుల్ ప్రీతి సింగ్

    అనంతరం బ్యాటింగ్‌ దిగిన ఎన్టీఆర్‌ జట్టు 63 పరుగులే సాధించింది. చివరి ఓవర్‌ 'విసిరిన' రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఓ వికెట్‌ తీసింది.

    సెకండ్ మ్యాచ్...

    సెకండ్ మ్యాచ్...

    రెండో మ్యాచ్‌ వెంకటేష్‌, రామ్‌చరణ్‌ జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచిన వెంకీ బ్యాటింగ్‌ ఎంచుకొన్నారు. వెంకీ ఓపెనర్‌గా వచ్చి చరణ్‌ వేసిన తొలి ఓవర్లలో మూడు సిక్సర్లు బాదారు.

    రామ్ చరణ్ క్యాచ్ లు...

    రామ్ చరణ్ క్యాచ్ లు...

    వికెట్‌ కీపర్‌ అవతారం ఎత్తిన రామ్‌చరణ్‌ మూడు చక్కటి క్యాచ్‌లు అందుకొన్నాడు. ఒక స్టంపౌట్‌ కూడా చేశాడు.

    చరణ్ సిక్స్ కొట్టినా...

    చరణ్ సిక్స్ కొట్టినా...

    ఆరు ఓవర్లలో 70 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చరణ్‌ జట్టు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. అయితే నితిన్‌ బౌలింగ్‌లో ఆది వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. చరణ్‌ కూడా ఓ సిక్స్‌ బాది అభిమానుల్ని అలరించాడు. కానీ చరణ్‌ జట్టు మాత్రం లక్ష్యాన్ని సాధించలేదు

    ఫైనల్‌ మ్యాచ్‌

    ఫైనల్‌ మ్యాచ్‌

    వెంకీ, నాగ్‌ జట్ల మధ్య జరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌ రెండు ఓవర్లే. టాస్‌ గెలిచిన నాగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకొన్నారు.

    అఖిల్ సిక్సర్లు..

    అఖిల్ సిక్సర్లు..

    ఈ మ్యాచ్‌లోనూ అఖిల్‌ సిక్సర్లతో హోరెత్తించాడు. మొత్తానికి రెండు ఓవర్లలో 26 పరుగులు చేసింది.

    నాగ్ జట్టు సక్సెస్ ..

    నాగ్ జట్టు సక్సెస్ ..

    అఖిల్‌ బౌలింగ్‌లో వెంకీ వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టి.. అలరించాడు. వెంకీ బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు నాగార్జున ఆసక్తితో తిలకించారు. ఈ మ్యాచ్‌లో నాగ్‌ జట్టు విజయం సాధించింది.

    మోహన్ బాబు...

    మోహన్ బాబు...

    విష్ణు టీమ్‌ను వండర్‌ఫుల్‌ టీమ్‌గా, మనోజ్‌ టీమ్‌ను క్రమశిక్షణలేని హారిబుల్‌ టీమ్‌గా మోహన్‌బాబు వర్ణించడం, దానిపై మనోజ్‌ టీమ్‌లోని బ్రహ్మానందం మైకులో పెద్దగా కేకలు వేయడం నవ్వులు పంచింది. మనోజ్‌ జట్టు ఆట ఆడాలని కాకుండా తమను కొట్టాలన్నట్లు ఆడిందని విష్ణు ఆరోపించారు.

    English summary
    Mega telethon ‘Memu Saitham’ which was planned in aid of the Vizag hudhud cyclone victims. The Telugu film industry attended in full force and made this event a grand success. Starting at 10 am in the morning the telethon went on till 11 in the night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X