హీరోయిన్స్ కి గిల్లి కజ్జాలు పెట్టేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే!
టాలీవుడ్ లో హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ రేంజ్ లో అంత డీప్ గా ప్రెండ్ షిప్ చేసే కథానాయకుడెవరా..? అని ఓ డిటెక్టివ్ జర్నలిస్ట్ ఇటీవల ప్రతి హీరోనూ ఫాలో అయ్యి బాగా గమనించాడట. అతని పరిశీలనలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడట. బాటీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి ఆడ స్నేహితులు ఎక్కువ. అతగాడు హీరోయిన్లతో తెగ క్లోజ్ గా ఉంటాడు. అలాగే టాలీవుడ్ హీరోయిన్లందరితో జోవియల్ కు మించిన జోవియల్ గా కలిసిపోయే వాడు స్టైలిష్ అర్జున్. అంతే కాదు హీరోయిన్ ఎవరైనా మూడీగా కూచుని ఉన్నా, వారవద్దకెళ్లి 'గిల్లి" తనకే తెలిసిన చుంచు ఎలుక చేసే 'కీచు" నవ్వుతో 'జోకి" వారు నవ్వే దాకా విడిచిపట్టడట. అయితే ఎంతమందితో క్లోజ్ గా ఉన్నా తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాజలే అంటున్నాడు అల్లుఅర్జున్. అందుకే కాబోలో ఆర్య 2లో లిఫ్ట్ లో లిప్ కిస్ ఇచ్చాడు. అంతే కాదండోయ్ సరదాగా ఎవరైనా మీరు కిస్సింగ్ సీన్లు ఎక్కువ చేస్తుంటారే అని అడిగితే మీకు కావాలా ఇంద ఓ కిస్ అని ఇచ్చి పారేస్తాడట. వామ్మో..అల్లు అర్జున్ బాలీవుడ్ సల్మాన్ రేంజ్ దాటినట్టు కనబడటం లేదూ అల్లు అర్జునా..మజాకా!


Click it and Unblock the Notifications











