సంక్రాంతి బరిలో బడా సినిమాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... సరదాలు తెచ్చిందే తుమ్మెదా...అంటూ ప్రతి పండక్కి తెలుగుగోళ్లంతా జాలీగా గడిపేస్తుంటారు. సంక్రాంతికి రంగురంగుల ముగ్గులతో ముంగిళ్లు నింపేయడం, కోడి పందాలు ఆడేయడటం, బోగి మంటలు వేయడం లాంటి వాటితో పాటు సంక్రాంతి సరదాల్లో సినిమా కూడా భాగమైపోయింది.
ప్రతి సంక్రాంతికి తెలుగు సినిమాల మార్కెట్ జోరుగా ఉంటుంది. అందుకే సంక్రాంతికి స్పెషల్ గా చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. ఈ సంక్రాంతికి కూడా పలు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఇందులో కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం', మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ చరణ్ 'నాయక్', ప్రభాస్ 'మిర్చి', కార్తి 'బ్యాడ్ బాయ్' లాంటి బడా సినిమాలతో పాటు.... సునీల్ 'మిస్టర్ పెళ్లి కొడుకు', అల్లు శిరీష్ 'గౌరవం' చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.

రామ్ చరణ్ తేజ్, వివి వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘నాయక్' జనవరి 9న విడుదలయ్యే అవకాశం ఉంది.

కమల్ హాసన్ ‘విశ్వరూపం' చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొదుతున్న ‘మిర్చి' చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

కార్తి హీరోగా తమిళంలో రూపొందుతున్న అలెక్స్ పాండ్యన్ తెలుగులో బ్యాడ్ బాయ్ పేరుతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సునీల్-ఇషా చావ్లా జంటగా బాలీవుడ్ మూవీ తను వెడ్స్ మను చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్ పెళ్లి కొడుకు' జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది.

మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న అల్లు శిరీష్ నటించిన ‘గౌరవం' చిత్రం జనవరి 11న రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











