క్రిస్‌మస్ టు సంక్రాంతి సినిమా పండగ(రిలీజ్ డేట్స్)

By Bojja Kumar

హైదరాబాద్: క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ సినిమాల వాళ్లకి నింజగా పండగే. ఎందుకంటే ఈ సీజన్ వాళ్లకు ఎక్కువ లాభాలు తెచ్చే సీజన్ కాబట్టి. వరుసగా పండగ హాలీడేస్ ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులంతా కుటుంబ సమేతంగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రేక్షకుల తాకిడికి తగిన విధంగానే.... సినిమాలు కూడా భారీ సంఖ్యలో విడుదలకు సిద్ధం అవుతూ ఉంటాయి. ఇప్పటి లాగే ఈ సీజన్లో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి ఏ రోజు ఏ సినిమా విడుదలవుతోందో... ఓ లుక్కేద్దాం.

అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న కడలి చిత్రం, ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న ఒంగోలు గిత్త చిత్రాలు జనవరి నెలలోనే విడుదల కానున్నాయి.

సారొర్చారు

ఈ క్రిస్ మస్ సీజన్లో తొలి సారిగా విడుదల సినిమా. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జీనియస్

ప్రముఖ టెలివిజన్‌ రియాలిటీ షో యాంకర్‌ ఓంకార్ దర్శకుడిగా పరిచయమవుతూ, నువ్విలా చిత్రం ఫేం హవీష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జీనియస్'. దాసరి కిరణ్‌ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వేటాడు వెంటాడు

విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర అందిస్తున్న ద్విభాషా చిత్రం ‘వేటాడు - వెంటాడు'. త్రిష కథానాయికగా నటిస్తోంది. డిసెంబర్ 21న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా తెక్కించారు.

గజరాజు

తమిళ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు తెలుగు తెరకు ‘గజరాజు' చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. తమిళంలో విక్రమ్ ప్రభు, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన ‘కుమ్కి' చిత్రం తెలుగులో ‘గజరాజు' పేరుతో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. మైనా(ప్రేమ ఖైదీ) ఫేం ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్.లింగుస్వామి, చంద్రబోస్‌లు నిర్మించగా బెల్లంకొండ సురేష్ అనువాద హక్కులు పొందారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలవుతోంది.

యముడికి మొగుడు

అల్లరి ‘నరేష్, రిచాపనయ్ నాయకానాయికలుగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ‘యముడికి మొగుడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాయక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "నాయక్". సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, అమలా పాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 9న విడుదలవుతోంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టే

వెంకటేష్, మహేస్ బాబు మల్టీ స్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 11న ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు.

బ్యాడ్ బాయ్

యుగానికి ఒక్కడు, ఆవారా చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన కార్తీ ఈసారి 'బ్యాడ్ బాయ్' గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 'అలెక్స్ పాండియన్' చిత్రాన్ని 'బ్యాడ్ బాయ్' గా తెలుగులోకి అనువదిస్తున్నారు. సూరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X