twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్‌కి హ్యాట్సాఫ్..తలుచుకుంటే ఏడుపొస్తుంది.. నరేష్!

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు.మా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపు కోసం ఇటు నరేష్, అటు శివాజీ రాజా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

     రాజేంద్ర ప్రసాద్‌కి హ్యాట్సాఫ్

    రాజేంద్ర ప్రసాద్‌కి హ్యాట్సాఫ్

    సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. గతంలోనే మా అసోసియేషన్ కు సంబంధించి న మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ తో ఓ విషయం చెప్పాను. అందరం అధ్యక్షుడిగా ఒక్కో టర్మ్ చేసే తప్పుకుందాం అని చెప్పాను. నేను ఆ మాట చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ చాలా హుందాగా వ్యవహరించి పోటీ నుంచి తప్పుకున్నాడు. నా మిత్రుడికి హ్యాట్సాఫ్. మరి నువ్వు చేస్తావా అని అడిగారు. ఆ సమయంలో శివాజీ రాజా కోరికని అర్థం చేసుకుని తానే అతడిని మా అధ్యక్షుడిని చేసినట్లు నరేష్ తెలిపారు.

    పేరు నాది, డబ్బు అన్నయ్యది.. నష్టపోయాం, ఇపుడు ధైర్యం లేదు: నాగబాబుపేరు నాది, డబ్బు అన్నయ్యది.. నష్టపోయాం, ఇపుడు ధైర్యం లేదు: నాగబాబు

    అసంతృప్తి ఉంది

    అసంతృప్తి ఉంది

    కొన్ని కారణాల వలన చాలా మందిలో శివాజీ రాజాపై అసంతృప్తి ఉందని నరేష్ అన్నారు. ప్రస్తుతం ఆ అంశాలపై తాము ఫోకస్ చేయాలని భావించడం లేదు. మా తల్లి విజయ నిర్మలగారు ప్రతి నెల తన ఫించన్ ని అసోసియేషన్ కోసం డొనేట్ చేస్తున్నారని నరేష్ తెలిపాడు. ప్రతి ఏడాది మా కుటుంబం నుంచి రెండున్నర లక్షలు మా అసోసియేషన్ కు నిధులు వస్తున్నాయని నరేష్ తెలిపారు.

     మనసుకు భాద కలిగించేలా

    మనసుకు భాద కలిగించేలా

    ఇటీవల మా అసోసియేషన్ లో మనసుకు భాద కలిగించే సంఘటనలు జరిగాయి, వాటిని తలుచుకుంటే కన్నీరు వస్తోంది అని నరేష్ భావోద్వేగానికి గురయ్యారు. తాను మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మొదట నా బాల్య మిత్రులు జీవిత, రాజశేఖర్ దంపతులని కలిసినట్లునరేష్ తెలిపారు. జీవితని జనరల్ బాడీ సెక్రటరీగా తీసుకుందామని అనుకుంటున్నట్లు రాజశేఖర్ తో తెలిపాను. నువ్వు అడుగుతుంటే కాదంటానా అంటూ అంగీకరించారు.

     నా అంత అనుభవం లేదు

    నా అంత అనుభవం లేదు

    శివాజీ రాజాకు ఇండస్ట్రీలో నా అంత అనుభవం లేకున్నా అతడు అధ్యక్షుడు కావడానికి అంగీకరించినట్లు నరేష్ తెలిపారు. తాను విజయం సాధిస్తే సరికొత్త విధానాలతో ముందు వస్తానని అన్నారు. త్రివిక్రమ్ లాంటి బడా దర్శకుల చిత్రాల్లో కూడా తాను ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు ఇప్పించినట్లు శివాజీ రాజా మీడియా సమావేశంలో తెలిపారు.

    English summary
    Tollywood Senior Actor Naresh Comments on Shivaji Raja & Rajendra Prasad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X