‘బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను‘.. వాళ్లకు ప్రకాశ్ రాజ్ హెచ్చరిక!
టాలీవుడ్ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన స్కాం హాట్ టాపిక్ గా మారింది. గతంలో తెలిసో తెలియకో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, టెలివిజన్ రంగానికి చెందిన సెలబ్రిటీలు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు పలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారు. కొన్నాళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. దీంతో చాలామంది అమాయకులు టాప్స్ ను డౌన్లోడ్ చేసి తమ ఖాతాలోనే డబ్బులను పోగొట్టుకుంటున్నారు.
సెలబ్రిటీలే ప్రమోట్ చేయడంతో వారిని ఎంతగా అభిమానించే ఆడియన్స్ యాప్ లను డౌన్లోడ్ చేయడమే కాకుండా వాటి ద్వారా డబ్బులు కోల్పోయి ఆర్థిక ఊబిలో కూరుకు పోతున్నారు. వీటిపై ఎప్పటినుంచో పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇక దీంతో అధికారులు రంగం లోకి దిగారు. కొద్దిరోజులుగా డాటా ను తీసి ఎవరెవరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు తారలకు నోటీసులు అందాయి.

తాజాగా ఈరోజు 18 మంది సినీ నటులపై కేసులు నమోదు చేశారు. వారిలో మొదటి వరుసలో యాంకర్ శ్యామల, సుప్రీత, రీతు చౌదరి, అజయ్, సన్నీ ఉన్నారు. మరోవైపు విష్ణు ప్రియ, బిగ్ బాస్ ఫెయింమ్ టేస్టీ తేజ ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరయ్యారు. గురువారం పంజాగుట్ట పోలీసులు వారిని విచారించారు. అయితే మియాపూర్ స్టేషన్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖుల పై కేసులు నమోదయ్యాయి. కొంతమంది హీరోయిన్ల పైన కూడా కేసులు పెట్టారు. అయితే తాజాగా ఈ కుంభకోణంపై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
తన పేరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ స్కామ్ లో వినిపించడం మూలంగా ఆయన తాజాగా స్పందించారు. షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా హుటా హుటిన ఓ వీడియోను విడుదల చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన ప్రమోషన్ ను తను ఎప్పుడో మానేశానని చెప్పారు. 2016లో తన దగ్గరకు ఇలాంటి యాడ్ వచ్చిందని, యాడ్ లో నటించాలని తప్పు ఒప్పుకున్నారు. ఆ తర్వాత చాలామంది మీరు ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయడం సరికాదు అంటూ ప్రశ్నించారన్నారు. అయితే అప్పటికే తనకు వాటి గురించి తెలియక అగ్రిమెంట్ మూలంగా ప్రమోట్ చేశానని చెప్పారు.
అయితే ఒకే ఒక బెట్టింగ్ కు సంబంధించిన యాడ్ లో నటించాలని చెప్పారు. అది కూడా ఏడాది పాటు అగ్రిమెంట్ ఉందని, ఆ తర్వాత ఆగిపోయింది అన్నారు. రీసెంట్ గా మళ్లీ ఆ యాడ్స్ ను వినియోగిస్తూ ఉంటే తానే స్వయంగా వద్దు అని నిర్వాహకులకు చెప్పినట్టు తెలియజేశారు. అయితే ఆ నిర్వాహకులు కూడా తన యాడ్ ను ఆపేసారని చెప్పారు. కానీ ఆ యాడ్ లీక్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. అందుకే తను ఒకటి మినహా ఇంకా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పోలీసులు తనపై కేసు నమోదు చేశారంటూ వస్తున్న వార్తలపైన స్పందించారు. ఇంకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. చివర్లో యువతను అలాంటి బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls
— Prakash Raj (@prakashraaj) March 20, 2025


Click it and Unblock the Notifications











